ఏప్రిల్ 11న జరుగనున్న ఏపిలో అసెంబ్లీ, లోక్ సభ ఎలక్షన్స్ జరుగనున్నాయి. అదేరోజు తెలంగాణాలో కూడా లోక్ సభ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అయితే ఈ ఎలక్షన్స్ లో సెటిలర్స్ ఓట్లు చాలా కీలకంగా మారనున్నాయి. తెలంగాణాలో ముఖ్యంగా హైదరాబాద్ లో సెటిలర్స్ ఉన్నారు. సెటిలర్స్ లో 18.50 లక్షల మంది ఏపి, తెలంగాణా రెండు చోట్ల ఓటు హక్కు ఉన్నవారు ఉన్నారు. అంటే వారు హైదరాబాద్ లో ఉన్నా ఏపిలో కూడా ఓటు హక్కుని వినియోగిస్తున్నారు.
రెండు వేరు వేరు చోట్ల ఎన్నికలు జరిగితే దాదాపు 18 లక్షలు మంది ఓట్లు వేస్తారు కాని ఇప్పుడు ఏపి, తెలంగాణాలో ఒకే రోజు ఓట్లు జరుగుతుండటం వల్ల వీరంతా ఎక్కడ ఓటు వేస్తారన్నది పెద్ద చర్చగా మారింది. తెలంగాణాలో లోక్ సభ ఎలక్షన్స్ కాగా ఏప్రిలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు ఒకేరోజు జరుగనున్నాయి.
ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుండి రెండు చోట్ల ఓటు హక్కుని వినియోగించుకున్నారని రిపోర్ట్ ఉంది. అయితే ఇప్పుడు సెటిలర్స్ ఈ ఎన్నికల్లో ఎక్కడ ఓటేస్తారు అన్నది హాట్ న్యూస్ గా మారింది. ఏపిలో నాలుగు జిల్లాల్లో ఎక్కువ సెటిలర్స్ ఉన్నారు. అది కూడా గుంటూరు, కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో సెటిలర్స్ ఉన్నారు. సెటిలర్స్ లో 70 శాతం మంది ఈ జిల్లాల్లోని వారే అని తెలుస్తుంది. 13 లక్షల మంది ఈ నాలుగు జిల్లాల్లో చెందినవారే. ఈ సెటిలర్స్ ఓట్లు ఏపి ఎన్నికల్లో ఆయా అభ్యర్ధుల గెలుపుని డిసైడ్ చేస్తాయి అందుకే ఇప్పుడు ఈ సెటిలర్స్ ఓట్లే చాలా కీలకంగా మారనున్నాయి.