తెలంగాణ వ్యాప్తంగా జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు : కేటీఆర్

-

తెలంగాణ వ్యాప్తంగా జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి కేటీఆర్‌ ప్రకటన చేశారు. దేశం లోని మొట్టమొదటిసారిగా మహిళా యూనివర్సిటీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారని ఆయన వెల్లడించారు. అందుకోసం ఈ బడ్జెట్ లో రూ. 100 కోట్లు కేటాయించారని గుర్తు చేశారు కేటీఆర్‌. తెలంగాణ లో ఆడపిల్ల పుడితే అదృష్ట లక్ష్మి పుట్టింది అనే సంబర పడే రోజులు వచ్చాయన్నారు.

కుల, మత తారతమ్యం లేకుండా 9 వేల కోట్ల తో కళ్యాణ లక్ష్మీ పథకo…. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మాతా శిశు మరణాల సంఖ్య గణనీయంగా తగ్గిందని పేర్కొన్నారు. అప్పుడే పుట్టిన శిశువుల కోసం ఇప్పటి వరకు 11 లక్షల కేసీఆర్ కిట్లు ఇస్తున్నామని…. మహిళ ల రక్షణ కోసం షీ టీమ్స్, భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసామని స్పస్టం చేశారు. ఔత్సాహిక మహిళా పారిశ్రామిక వేత్తలు ఏర్పాటు చేసేందుకు వీ-హబ్ ఏర్పాటు చేసామని మంత్రి కేటీఆర్‌ గుర్తు చేశారు. నిన్న ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో పటాన్ చెరు లో 350 పడకల ఆసుపత్రి కి నిధులు కేటాయించామని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news