తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని రాష్ట్ర ఐటీ మరియు మున్సిపల్ కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. మంగళవారం పటాన్‌చెరులో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొని మాట్లాడారు. మహిళల కోసం కల్యాణ లక్ష్మీ, షాది ముబారక్, కేసీఆర్ కిట్, ఒంటరి మహిళ పెన్షన్ లాంటి పథకాలు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు.