తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. నిన్నటి వరకు తెలంగాణ రాష్ట్రంలో కొంత వరకు వ్యతిరేకత ఉండేది. కానీ ఈ రోజు అసెంబ్లీలో కేసీఆర్ చేసిన ఒకే ఒక్క ప్రకటనతో కేసీఆర్.. రెట్టింపు క్రేజ్ తో దూసుకువచ్చారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వంపై నిరుద్యోగులు తీవ్ర అసంతృప్తిగా ఉండేవాళ్లు. కానీ నేడు సీఎం కేసీఆర్ 90 వేల ఉద్యోగ భర్తీ ప్రకటన చేసిన తర్వాత.. కేసీఆర్ కు నిరుద్యోగులు పాలాభిషేకాలు చేస్తున్నారు.
కాగ ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ చేసిన హామీల్లో ఉద్యోగాల భర్తీ ఒక్కటే నెరవేర్చలేదు. కానీ ఇప్పుడు అది కూడా నెరవేరింది. అలాగే సీఎం కేసీఆర్ లక్ష ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఇచ్చిన హామీ నెరవేరింది. దీంతో టీఆర్ఎస్ నాయకులు.. కేసీఆర్ సింగిల్ పీస్ ఈడ.. బరాబర్ చెప్పిందే చేస్తారు అంటూ కేసీఆర్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగ కేసీఆర్ ఇప్పటి వరకు ప్రకటించినవన్నీ కూడా దాదాపు పూర్తి చేశారు.
కేసీఆర్ కూడా పలు సమావేశాల్లో.. బరాబర్ చెప్పింది చేస్తాం. మాట తప్పితే.. తల నరుక్కుంటాం. అని పలు అనేక సార్లు సీఎం కేసీఆర్ ప్రకటన చేశారు. ఇప్పుడు కేసీఆర్ అన్న మాటలు వైరల్ అవుతున్నాయి. కాగ కేసీఆర్.. దేశ రాజకీయాల్లోకి వెళ్తున్న సమయంలో కేసీఆర్ తన హామీలను నెరవేర్చడం కొంత వరకు ఉపయోగంగా ఉంటుంది.