Akhil Akkineni : “ఏజెంట్” సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

-

టాలీవుడ్ మన్మథుడుగా పేరు తెచ్చుకున్న అక్కినేని నటవారసుడు నాగార్జున తనయుడు అఖిల్(akhil) గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. ఇన్ని రోజులూ ఈ యంగ్ హీరో చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద డివైడ్ టాక్ తెచ్చుకోవడంతో ఈ హీరోకు ఇంత వరకు కెరీర్ లో సరైన హిట్ పడలేదు. ఇప్పటి వరకు లవర్ బాయ్ ఇమేజ్ కోసం పరితపించి భంగపడ్డ ఈ హీరో ప్రస్తుతం విలక్షణ దర్శకుడు సురేందర్ రెడ్డితో కలిసి “ఏజెంట్” అనే మూవీ చేస్తున్నాడు.

 

ఈ మూవీలో అఖిల్ క్యారెక్టరైజేషన్ భిన్నంగా ఉండనుందని సమాచారం. సురేందర్ రెడ్డి సినిమాలంటేనే హీరోల గెటప్ పూర్తిగా మార్చేస్తాడని టాక్ ఉంది. గతంలో ఆయనతో సినిమాలు చేసిన మహేశ్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్ ల గెటప్ లను గుర్తు పట్టలేకుండా మార్చేసి కొత్తగా ప్రజెంట్ చేశాడు. ఇప్పుడు యంగ్ హీరో అఖిల్ ను కూడా అలాగే మార్చేసేందుకు కంకణం కట్టుకున్నాడు.

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరి దశకు రాగా.. తాజాగా ఈ మూవీ విడుదల తేదీని కూడా ప్రకటించారు. ఏజెంట్ సినిమా అక్టోబర్ 12వ తేదీన థియేటర్లలో విడుదల కానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ మేరకు అఖిల్ అదిరిపోయే పోస్టర్ను కూడా విడుదల చేసింది. ఇందులో మిషన్ గన్ పట్టుకొని అఖిల్ మాస్ లుక్ లో కనిపించాడు.

Read more RELATED
Recommended to you

Latest news