అమరావతి రైతులకు జగన్‌ శుభవార్త..వారికోసం రూ. 208 కోట్లు విడుదల

-

అమరావతి : నిన్న ఏపీ ప్రభుత్వం…. 2022-23 బడ్జెట్‌ ను అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. అయితే… ఈ బడ్జెట్‌ లో…రాజధాని అలాగే.. అమరావతి రైతుల కోసం ప్రత్యేకంగా కేటాయింపులు చేసింది సర్కార్‌. రాజధాని నిర్మాణం సహా వివిధ అవసరాల నిమిత్తం బడ్జెట్టులో రూ. 1329.21 కోట్ల కేటాయింపులు చేసింది.

Cm Jagan
Cm JaganCm Jagan

కేంద్ర నిధులు రూ. 800 కోట్లతో రాజధాని నిర్మాణ పనులు చేపడతాని బడ్జెట్టులో పేర్కొంది జగన్ సర్కార్. రాజధాని గ్రామాల్లోని పేదల కోసం క్యాపిటల్ రీజియన్ సోషల్ సెక్యూర్టీ ఫండ్ నిమిత్తం రూ. 121.11 కోట్ల కేటాయింపు చేయగా.. రాజధాని రైతులకిచ్చే కౌలు చెల్లింపుల కోసం రూ. 208 కోట్ల కేటాయింపులు చేసింది. రాజధాని గ్రామాల్లో గ్రీనరీ, ఎల్ఈడీ బల్బుల నిర్వహాణ, శానిటేషన్, కరకట్ట విస్తరణకు అవసరమైన భూ సేకరణ నిమిత్తం రూ. 200 కోట్లు బడ్జెట్టులో కేటాయించింది ప్రభుత్వం. కాగా..అమరావతి రైతులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని..  ఏపీ హై కోర్టు ఇటీవల ఆదేశించిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news