ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టులకు పోటీపడే అభ్యర్థులకు మెదక్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మెదక్ పట్టణంలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు అల్లాదుర్గం ఎస్ఐ ప్రవీణ్ రెడ్డి తెలిపారు. పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారు అల్లాదుర్గ్ పోలీస్ స్టేషన్ లో పేర్లు నమోదు చేసుకుంటే అభ్యర్థులకు ఉచిత భోజనం, ఉండడానికి ఏర్పాట్లు చేస్తామని అన్నారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.