మద్యానికి డబ్బు ఇవ్వలేదని ఓ యువకుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్ జిల్లా కేంద్రంలోని బీడీ కార్మికుల కాలనీలో చోటుచేసుకున్నది. కాలనీకి చెందిన సాగర్(23)తాగుడుకు బానిసయ్యాడు. డబ్బు ఇవ్వమని తల్లితో రోజూ గొడవ పడేవాడు. తల్లి డబ్బు ఇవ్వకపోవడంతో వారం రోజుల క్రితం ఎలుకల మందు తాగాడు. చికిత్స అందించడంతో కోలుకున్నాడు. మళ్లీ డబ్బు ఇవ్వాలని తల్లితో గొడవ పడి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడాడు.