రెండు తెలుగు రాష్ట్రాలలో ఎండలు భగభగ మండిపోతున్నాయి. మార్చి నెలలోనే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల దాటేసింది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒంటిపూట బడులు నిర్వహిస్తోంది. అయితే తాజాగా ఏపీ ప్రభుత్వం కూడా ఒంటిపూట బడులు నిర్వహించాలని ఆలోచన చేస్తోంది. ఏప్రిల్ మాసం మొదటి వారం నుంచి ఒక పూట తరగతులు నిర్వహించ నున్నారు.
అయితే ప్రతి ఏడాది మార్చిలోనే ఒంటిపూట బడులు నిర్వహించేవారు. కానీ ఈ విద్యా సంవత్సరంలో పాఠశాలల పనిదినాలు తక్కువగా ఉండటంతో ఏప్రిల్ నుంచి అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2021- 22 విద్యా సంవత్సరంలో కరోనా కారణం ఆగస్టు మూడో వారం నుంచి పాఠశాలలు ప్రారంభమయ్యాయి. దీంతో పని దినాలు తగ్గడంతో… కొన్ని సెలవు దినాలలో పాఠశాలలు పనిచేసేలా 180 రోజులకు విద్యాశాఖ క్యాలెండర్ ను ఏర్పాటు చేసింది. అయితే ఇంకా సిలబస్ పూర్తి కానందున ఈ నెల నుంచి కాకుండా వచ్చే నెల మొదటి వారం నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.