ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీ అవమానాన్ని ఎదుర్కొంది. అయితే కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఓటమి తర్వాత బ్యాడ్మింటన్ ఆడారు అన్న వార్త ఒకటి వైరల్ గా మారింది. నిజానికి ఈ మధ్య కాలం లో సోషల్ మీడియాలో ఫేక్ వార్తలను విపరీతంగా వస్తున్నాయి. అయితే మరి ఇది నిజమైన వార్తా లేదంటే నకిలీ వార్తా అనేది ఇప్పుడు చూద్దాం.
ఐదు రాష్ట్రాల ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీ అవమానాలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత రాహుల్ గాంధీ బ్యాడ్మింటన్ ఆడారని వీడియోని షేర్ చేశారు. సోషల్ మీడియా లో ఈ వార్త ఇప్పుడు వైరల్ గా మారింది. చాలా మంది కామెంట్లు కూడా చేసి ఈ వీడియోని తప్పు దారి పట్టిస్తున్నారు.
కొంత మంది పార్టీ నాయకులు, పోలీసులు ఉండగా రాహుల్ గాంధీ బ్యాడ్మింటన్ ఆడడాన్ని ఆ వీడియో లో మనం చూడొచ్చు. ఇక ఇందులో నిజం ఎంత అనేది చూస్తే,, ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత రాహుల్ గాంధీ బాడ్మింటన్ ఆడిన వీడియో లో నిజం లేదు. ఎన్నికల ఫలితాలు వెలువడడానికి ఒక రోజు ముందు రాహుల్ గాంధీ బాడ్మింటన్ ఆడారు. అప్పటి వీడియో అది.