ఒక వ్యక్తి గురించి చెప్పాలి.. ఏపీ ప్రభుత్వం కొత్త జీవో వచ్చినప్పుడు ఇది కరెక్ట్ గా లేదు మనకు ఇబ్బందికరంగా ఉంటుంది అని చెప్పడానికి ఇండస్ట్రీ ఎంతో ప్రయత్నించింది… నేను ట్రై చేశాను, ఒక వ్యక్తి వచ్చి ముఖ్యమంత్రి గారితో తనకున్న సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకుని రెండు మూడు సార్లు కలిసి కొత్త జీవో రేట్లు పెంచడానికి కారణమై వ్యక్తి ‘మెగాస్టార్ చిరంజీవి’ గారు అని రాజమౌళి అన్నారు. ఆయనను చాలా మంది చాలా మాటలు అన్నారు. మమ్మల్ని నెగ్గించడానికి ఆయన ఎంతో తగ్గారు.. నిజంగా మీరు ట్రూ మెగాస్టార్ అంటూ ప్రశంసలు కురిపించారు. తెలంగాణలో జీవో రావడానికి కూడా చిరంజీవి గారే కారణం అని రాజమౌళి అన్నారు. ఆయన తెర వెనక ఉండి అంతా నడిపించారని రాజమౌళి అన్నారు. ఆయన ఇండస్ట్రీ పెద్దగా పిలిపించుకోవడం ఇష్టం ఉండదు, ఆయన ఇండస్ట్రీ బిడ్డగానే అనిపించుకోవడం ఇష్టం అని… కానీ నేను మాత్రం ఆయన్ని ఇండస్ట్రీ పెద్దగానే గౌరవిస్తాను అని.. ఇండస్ట్రీ అంతా ఆయనకు రుణపడి ఉండాలని రాజమౌళి అన్నారు.