ఎంత కాలమైంది ఈ పిచ్చుకమ్మని కాకమ్మని చూసి …
వద్దురెరోయ్ వద్దు కాకమ్మ కథలు చెప్పమాకు నువ్వే సెల్ టవర్ పెడతావ్..
నువ్వే రేడియేషన్ స్ప్రెడ్ చేస్తావ్ మళ్లీ ఎకసెకలు ఒకటి..
వద్దులే నిన్ను నమ్మాను చూడు నాదీ బుద్ధి తక్కువ.
నీ కాన్వాసుల్లో ..కాదురా నన్ను ఈ వినీలాకాశంలో తిరగనీయ్ హాయిగా…
గుప్పెడు గింజలు పెట్టు..పట్టెడు మెతుకులు పెట్టు.. ప్రేమించు.. ప్రేమను పంచు..
అంతకుమించి ఏం వద్దురోయ్ .. మళ్లీ మీ మనుషులను నమ్మలేం నచ్చిందంటే చాలు
వండుకు తినేస్తారు.ఉంటానిక బాస్.సారీ నీకీ పదబంధం నచ్చదు కదూ! వర్డ్ సెన్స్ అర్థం చేసుకుంటావుగా అది చాలు.
(సందర్భం : మార్చి 20 ప్రపంచ పిచ్చుకల దినోత్సవం)
థాంక్యూ అప్పన్న గారు ఇంత మంచి పిక్ అప్ చేసి నా బాధ్యతను గుర్తు చేసినందుకు. లవ్ యూ సర్ లవ్ యూ.. నేనక్కడ ఉన్నా మీ మదిలో నా చోటు పదిలమ్. కాదది పంకిలమ్. ఇహమ్ పరమ్ ఇదే వాస్తవమ్.. అనవయ్యా ఇప్పుడు “ఇమ్మనరే ఈ లాలికి స్వరమూ ఇహమూ పరమూ..” అని..