బంగారానికి ఉన్న డిమాండ్ మరే వస్తువుకు లేదు. దీనిని కొనేందుకు.. ప్రజలు బాగా ఎగబడతారు. ధరలు మండి పోతున్నప్పటికీ… మహిళలు కచ్చితంగా బంగారం కొనుగోలు చేస్తారు. ఇక కరోనా, రష్యా- ఉక్రెయిన్ యుద్దం కారణంగా.. ఇండియాలో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగి పోయాయి. గతంలో 40 వేలల్లో ఉన్న బంగారం.. ఇప్పుడు 50 వేలు క్రాస్ అయింది.
అయితే.. తాజాగా బంగారం ధరలు ఇండియాలో పెరిగి పోయాయి. హైదరాబాద్ నగరంలో బంగారం ధరల వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ మార్కెట్ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.100 పెరిగి రూ. 51,700 గా నమోదు కాగా…. అదే సమయం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 100 పెరిగి రూ. 47,400 గా పలుకుతుంది. ఇక వెండి ధరలు కూడా పెరిగాయి. కేజీ వెండి ధర రూ.300 పెరిగి రూ.72,600 గా నమోదు అయింది.