వాహనాదారులకు చమురు సంస్థలు బిగ్ షాక్ ఇచ్చాయి. పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఉక్రెయిన్ – రష్యా యుద్ధం వల్ల అంతర్జాతీయంగా క్రూయిడ్ ఆయిల్ ధరలు భారీగా పెరిగాయని చమురు సంస్థలు తెలిపాయి. దీంతో చమురు సంస్థలు రోజు రోజుకు భారీ స్థాయిలో నష్ట పోతున్నాయని అందు కోసమే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వివరించారు. కాగ లీటర్ పెట్రోల్ పై 91 పైసలు, డీజిల్ పై 88 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.
కాగ పెరిఇన ధరలు హైదరాబాద్ లో మంగళ వారం ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వచ్చాయి. కాగ గత ఐదు నెలల నుంచి పెట్రోల్, డీజీల్ ధరలు పెరగలేదు. ఐదు నెలల తర్వాత.. ఈ రోజు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. మరి కొన్ని రోజుల పాటు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. కాగ నిన్నటి వరకు హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.20 ఉండగా, లీటర్ డీజిల్ ధర రూ. 94.62 గా ఉంది. కాగ నేడు పెరిగిన ధరలతో హైదరాబాద్ నగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 109.10 కు, డీజిల్ ధర రూ. 95.49 కు చేరింది.