వేసవిలో చెమట మరీ ఎక్కువగా పడుతోందా? ఇలా చేయండి

-

ఎండాకాలం అంటేనే చాలు.. బాడీ అంతా చెమట.. రోజుకు రెండు సార్లు కాదు కదా.. నాలుగు సార్లు చేసినా.. ఫ్రష్‌ ఫీల్‌ ఉండదు. ఒకటే చెమట దారలు కారుతుంది. కొందరికైతే.. చెమటతో బట్టలు తడిచిపోతాయి. ఇంట్లో అంటే.. సరే ఎలాగోలా మేనేజ్‌ చేసుకోవచ్చు. కానీ బయటకు వెళ్లినప్పుడు కూడా ఇదే పరిస్థితి అయితే అసలు ఇక పక్కన ఎవరైనా ఉండగలుగుతారా.. ఎన్ని పర్ఫ్యూమ్స్‌ వాడాలో.. బాడీలో ఎక్కువగా చెమట రాకుండా ఉండాలంటే.. కొన్ని పద్థతులు పాటిస్తే మరీ అంత సమస్య ఉండదట. అవేంటో చూద్దామా.!

ఒక గ్లాస్‌ నీటిలో యాపిల్ సైడర్ వెనిగర్ కలపండి. అందులో కాటన్ బాల్‌ను ముంచి… దానితో గొంతు, చంకలు, చేతులు, అరికాళ్లకు మర్దన చేయండి. రాత్రి నిద్రపోయే ముందు ఇలా చేయాలి. ఉదయం నిద్రలేవగానే స్నానం చేయాలి. ఇలా చేస్తే శరీరానికి ఎక్కువ చెమట పట్టదంటున్నారు నిపుణులు.

టమాటాలో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. అవి శరీరంలో ఉన్న మలినాలను బయటకు పంపిస్తాయి. ఒక వారం పాటు.. ప్రతి రోజు గ్లాస్ టమాటా రసం తాగండి. దీనివల్ల బాడీలో ఉన్న టాక్సిన్స్‌ అన్నీ తొలగిపోతాయి. హెల్త్‌కు చాలా మంచిది. తేనె, నిమ్మరసం వేసుకుని ఉదయం తాగితే.. మంచి డైట్‌లా కూడా ఉంటుంది.

అధిక ఒత్తిడి, టెన్షన్ ఎక్కువగా ఉన్నా… చెమట అధికంగా పడతాయి. అందుకే ప్రతి రోజు ధ్యానం చేయాలి. శ్వాస ఎక్సర్‌సైజ్‌లు చేయడం ద్వారానూ చెమట సమస్యకు చెక్ పెట్టేయొచ్చు.

ఆహారాల్లో మసాలాలు, కారం, నూనె ఎక్కువగా ఉండకుండా జాగ్రత్తపడాలి. అసలే ఎండ మంట.. ఇక తినే ఫుడ్‌ ఐటమ్స్‌ కూడా మసాలాలు, మంటలు అయితే బాడీకి ఎక్కువ వాటర్‌ అందించాల్సి ఉంటుంది. ఇక అలాగే చెమట కూడా ఎక్కువగా బయటకు వస్తుంది.

ఉప్పు ఎక్కువగా తిన్న చెమట ఎక్కువగా వస్తుంది. అందుకే వేసవిలో ఉప్పును పరిమితంగానే తీసుకోవాలి. ఎంత తగ్గిస్తే అంత మంచిది. అసలు ఉప్పునూ ఏకాలంలో కూడా అధికంగా వాడటం మంచిది కాదు. బరువు పెరగడానికి ఉప్పుకూడా ఒక కారణం అని సైంటిఫిక్‌గా ప్రూవ్‌ చేశారు.. కాబట్టి కూరల్లో ఉప్పు తక్కువ వాడటం మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news