భార్య పై లైంగిక దాడి కూడా అత్యంత కర్ణాటక హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. వివాహం పేరుతో మహిళలపై వారి భర్తలు సాగిస్తున్న లైంగిక క్రూరత్వానికి వివాహమే లైసెన్సు కాదని హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. పెళ్లి చేసుకున్నా నాటి నుంచి తన భర్త తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ కర్ణాటకకు చెందిన ఓ మహిళ హైకోర్టును ఆశ్రయించింది.
అయితే ఈ కేసు విచారణ సందర్భంగా కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రాజ్యాంగం కల్పించిన హక్కుల మేరకు స్త్రీ మరియు పురుషులు ఇద్దరూ సమానమే అని చెప్పింది కోర్టు. భార్య తక్కువ, భర్త ఎక్కువ అంటే కుదరదని హెచ్చరించింది.
వివాహం అనంతరం మహిళపై బలవంతంగా లైంగిక చర్యకు పాల్పడే భర్తల గురించి తానే మాట్లాడడం లేదని చెప్పిన కోర్టు… పెళ్లి చేసు కుంటేనే భార్యను ఎలాగైనా చూడవచ్చని భావిస్తున్న భర్తల గురించి చర్చిస్తున్నామని పేర్కొంది. భర్త ఈ నాటికీ మనిషి మనిషే… భర్త అయిన పురుషుడి లైంగిక దాడి దారుణం నేరమే. భార్య అయిన మహిళపై భర్త అత్యాచారం కూడా అత్యాచారం అని కోర్టు వ్యాఖ్యానించింది. భార్య పై లైంగిక దాడి చేసే హక్కు పురుషుడైన భర్తకు వివాహం ఇవ్వలేదని స్పష్టం చేసింది.