పెళ్లి అయ్యింది కానీ.. శోభనం రాత్రి భార్య చేసిన పనికి భర్తకు కోలుకోలేని షాక్ !

-

రాజస్థాన్ లో దారుణం చోటుచేసుకుంది. శోభనం రోజే ఓ పెళ్లి కూతురు వేరే వ్యక్తితో జంప్ అయ్యింది. ఈ ఘటన రాజస్థాన్ లోని బార్ మేడ్ జిల్లాలో జరిగిన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. బార్ మేడ్ జిల్లాకు చెందిన సురేష్ అనే వ్యక్తికి ఇటీవల పెళ్లి జరిగింది. స్థానికంగా ఉన్న సమత అనే మహిళతో సురేష్ వివాహం జరిగింది.

అయితే పెళ్లి చాలా ఘనంగా జరగగా.. పెళ్లయిన మూడోరోజు శోభనానికి ముహూర్తం పెట్టారు. అయితే ఈ నేపథ్యంలోనే ఆ నూతన వరుడికి ఊహించని షాక్ ఇచ్చింది సమత. ఇంట్లో ఉన్న 50 లక్షల రూపాయలు, మూడు తులాల బంగారం పట్టుకొని జంప్ అయ్యింది. బ్యూటీ పార్లర్ కు వెళ్లి వస్తానని చెప్పిన సమత రాకపోవడంతో… సురేష్ ఆమెకు ఫోన్ చేశాడు.

అయితే మొదట ఫోన్ లిఫ్ట్ చేయని సమత ఆ తర్వాత ఉన్న విషయాన్ని చెప్పేసింది.”నాకు వేరే వ్యక్తితో పెళ్లి ఇప్పటికే జరిగింది. ఒక బాబు కూడా ఉన్నాడు. అసలు నువ్వంటే ఇష్టమే లేదు. అందుకే నా భర్త దగ్గరికి వెళ్లి పోతున్నాను “అంటూ సమాధానమిచ్చింది సమత. దీంతో సురేష్ ఉలిక్కిపడ్డాడు. చేసేది ఏమీ లేక స్థానిక పోలీసులకు సమతా పై ఫిర్యాదు చేశాడు. సురేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు మొదలుపెట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news