ఏపీలో ప్రభంజనం సృష్టించనున్న వైఎస్సార్సీపీ.. ఎన్డీటీవీ సర్వే

-

ఒక్క ఎన్డీటీవీ సర్వే మాత్రమే కాదు.. చాలా సర్వేలు వైఎస్సార్సీపీ వచ్చే ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించనున్నట్లు తెలిపాయి. ఎంపీ సీట్లు అత్యధికంగా గెలుచుకోవడమే కాదు.. ఎమ్మెల్యే సీట్లు కూడా అధికంగా గెలిచి ఏపీలో వైఎస్సార్సీపీ అధికారంలోకి రానున్నట్లు పలు సర్వేలు వెల్లడించాయి.

వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకన్నా ప్రాంతీయ పార్టీలకే ఎక్కువగా సీట్లు వస్తాయని ఎన్డీటీవీ సర్వే వెల్లడించింది. ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి కేంద్రంలో నిర్ణయాత్మక పాత్ర పోషించనున్నట్టు జాతీయ చానెల్ ఎన్డీటీవీ తన సర్వేలో తెలిపింది. ఏపీలో ఉన్న 25 ఎంపీ సీట్లలో 20 సీట్లను వైఎస్సార్సీపీ గెలుచుకొని ప్రాంతీయ పార్టీల్లోనే మూడో అతి పెద్ద పార్టీగా నిలుస్తుందట.

మరోవైపు పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ కు 30 సీట్లు, తమిళనాడులో డీఎంకేకు 25 సీట్లు వస్తాయట. ఒడిశాలో బిజూ జనతాదళ్ 16 సీట్లు, తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ 15 సీట్లు గెలుచుకోనున్నట్టు ఎన్డీటీవీ సర్వే వెల్లడించింది. దీంతో ప్రాంతీయ పార్టీల గెలిచిన సీట్లన్నీ కలిపితే వచ్చే 106 సీట్లే కేంద్రంలో కీలకం కానున్నట్టు సర్వే వెల్లడించింది.

NDTV survey revealed that ysrcp wins in 20 mp seats in ap

అయితే.. ఒక్క ఎన్డీటీవీ సర్వే మాత్రమే కాదు.. చాలా సర్వేలు వైఎస్సార్సీపీ వచ్చే ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించనున్నట్లు తెలిపాయి. ఎంపీ సీట్లు అత్యధికంగా గెలుచుకోవడమే కాదు.. ఎమ్మెల్యే సీట్లు కూడా అధికంగా గెలిచి ఏపీలో వైఎస్సార్సీపీ అధికారంలోకి రానున్నట్లు పలు సర్వేలు వెల్లడించాయి.

ఇండియా టీవీ సర్వే ప్రకారం… ఏపీలో వార్ వన్ సైడేనని… వైఎస్సార్సీపీ స్వీప్ చేస్తుందని లోక్ సభలోనే నాలుగో అతి పెద్ద పార్టీగా అవతరిస్తుందని వెల్లడించింది. ఇండియా టీవీతో పాటు.. ఇతర జాతీయ చానెళ్లు కూడా వైసీపీకి 20 నుంచి 22 ఎంపీ సీట్లు రానున్నట్లు తెలిపాయి.

Read more RELATED
Recommended to you

Latest news