హిందీ అర్జున్‌ రెడ్డి .. కబీర్‌ సింగ్‌ టీజర్ మక్కీ టు మక్కీ

-

విజయ్‌ దేవరకొండ అర్జున్‌రెడ్డి సృష్టించిన బీబత్సం అంతా ఇంతా కాదు.. చిన్న సినిమాగా విడుదలై ప్రభంజనాన్ని సృష్టించిది. అయితే ఈ సినిమాని తమిళం, హింది ఇంకా పలు భాషల్లో రిమేక్‌ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే హిందీలో కబీర్‌ సింగ్‌ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో షాహీద్‌ కపూర్‌ హీరోగా నటిస్తుండగా, కయారా అద్వానీ హీరోయిన్‌గా చేస్తుంది. ఈ సినిమా టీజర్‌ ఈ రోజు విడుదల చేశారు చిత్ర యూనిట్‌.టీజర్‌ చూస్తుంటే కొత్తగా ఏమీ లేదు ట్రైలర్‌ మక్కీ టూ మక్కీ దించేశారు. సీన్‌ టూ సీన్‌ అనే కాదు.. మ్యూజిక్‌ కూడా సేమ్‌ వాడేశారు. హిందీలో ఇంకా బోల్డ్‌గా తీశారని వినికిడి.. కానీ అర్జున్‌రెడ్డికి పెద్దగా మార్పులు చేసినట్లు కనిపించట్లేదు. కబీర్‌ సింగ్‌ చిత్రానికి కూడా అర్జున్‌ రెడ్డి దర్శకుడైన సందీప్‌ వంగానే దర్శకత్వం వహిస్తున్నాడు.

షాహీద్‌ కపూర్‌ ఇలాంటి ఛాలెంజింగ్‌ రోల్స్‌ ఇప్పటికే చేసేశాడు కాబట్టి అర్జున్‌ రెడ్డి రోల్‌ ఇరగదీస్తాడనుకోవచ్చు.. హిందీలో ఇంకా మసాలా దట్టిస్తే మాత్రం అంచనాలను మించేస్తుంది… జూన్‌ 21న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తేనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news