రష్మిక మంధన జాక్‌పాట్‌.. అల్లు అర్జున్‌ సినిమాలో ఛాన్స్‌

-

Allu Arjun Pairing with Rashmika Mandanna in sukumars Movie
Allu Arjun Pairing with Rashmika Mandanna in sukumar’s Movie

టాలీవుడ్‌లో సక్సెస్‌ కావాలంటే కేవలం అందం, నటన ఉంటే సరిపోదు అదృష్టం కూడా ఉండాలి.. అంతేనా నటించిన సినిమాల రికార్డులను పరిగణిస్తారు. మరి అందానికి అందం, నటనతోపాటు సక్సస్‌ రేటు మాంచిగా ఉన్న భామ రష్మికా మందన. అరంగేట్రమే హిట్ తో మొదలయ్యింది ఈ చేప కళ్ల సుందరిది. ఈ అందాల చందమామ సూపర్‌ ఛాన్స్‌ కొట్టేసింది. స్టైలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ సినిమాలో నటించేందుకు రష్మిక మంధనను ఎన్నుకున్నట్లు టాలీవుడ్‌ వర్గాల సమాచారం.

ఛలో సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైన రష్మిక చేసిన సినిమాలన్నీ హిట్‌ కొట్టాయి (దేవదాసు తప్ప)… ఇప్పటికే వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ భామ అల్లు అర్జున్‌, సుకుమార్‌ సినిమాలో ఛాన్స్‌ కొట్టేసిందట. ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ డియర్‌ కామ్రేడ్‌ చిత్రంలో నటిస్తుంది. అల్లు అర్జున్‌ ప్రస్తుతం త్రివిక్రమ్‌ సినిమా కోసం సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా తరువాత సుకుమార్‌ చిత్రం ప్రారంభం అవుతుంది. మైత్రీమూవీ మేకర్స్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news