ఇలాంటి వారితో ఉంటే జీవితం నరకమే.. వీళ్ళకి దూరంగా ఉంటేనే బెస్ట్..!

-

మనసు ప్రశాంతంగా ఉండాలంటే మన చుట్టూ ఉండే వ్యక్తులు కూడా సరిగ్గా ఉండాలి. నిజానికి మనం ఎంత బాగా ఉండాలనుకున్నా మన చుట్టూ ఉండే మనుషులు, నెగెటివ్ వాతావరణం మనల్ని మూడ్ ఆఫ్ చేస్తుంది. నిజానికి మనకి ఆనందం మన చుట్టూ ఉండే వాతావరణం పై ఆధారపడి ఉంటుంది.

అందుకనే మనం మన చుట్టూ ఉండే వాతావరణం పై కూడా కాస్త దృష్టి పెట్టాలి. మనం కనుక విజయం సాధించాలి అనుకుంటే మన చుట్టూ ఉండే వాళ్ల పై కూడా ఆ విషయం ఆధారపడి ఉంటుంది. నిజానికి ఇలాంటి మనుషులు ఉంటే నరకాన్ని చూడాల్సి వస్తుందని ఆచార్య చాణక్య చెప్పారు.

పైగా ఇలాంటి వాళ్ళ వల్ల లక్ష్యం కూడా చేరుకోవడానికి వీలు కాదని అన్నారు. అయితే మరి ఎలాంటి మనుషులతో దూరంగా ఉండాలి..? ఎలాంటి వాళ్ళ వల్ల మనకి ఇబ్బంది కలుగుతుంది..? వాళ్ల వల్ల నరకయాతన ఎందుకు అనుభవించాలి అనే దాని గురించి ఆచార్య చాణక్య ఏం చెప్పారో ఇప్పుడు చూద్దాం.

సంతోషంగా లేని వ్యక్తులు:

మనం కనుక జీవితంలో సాధించాలంటే కచ్చితంగా సంతోషంగా లేని వ్యక్తులకు దూరంగా ఉండాలి. అటువంటి వ్యక్తుల మధ్య జీవితాన్ని గడపాల్సి వస్తే నిజంగా జీవితం నరకప్రాయం అవుతుందని చాణక్య అన్నారు. వాళ్ళల్లో ఉండే నిరాశాపూరితమైన ధోరణి ప్రతికూల ప్రభావం చూపుతుంది. కాబట్టి విజయం సాధించాలంటే అస్సలు కుదరదు. అందుకని వాళ్ళకి దూరంగా ఉండాలి.

దుర్మార్గపు భార్య:

భార్య ఎప్పుడూ కూడా సంస్కారవంతురాలు, గుణవంతురాలు అయి ఉండాలి. అలానే ఆమెకి తెలివితేటలు ఉంటే భర్తకు అడుగడుగునా ధైర్యంగా ఉంటుంది. పైగా మంచి చెడు ఇద్దరూ నిర్ణయించుకోవడానికి అవుతుంది. అదే ఒకవేళ భార్యకి దుష్ట గుణాలు కలిగి ఉంటే భర్త ఎంత సమర్థుడైన జీవితం నరకప్రాయం గానే ఉంటుంది. అందుకనే చక్కటి గుణాలు ఉన్న భార్య ని పెళ్లి చేసుకోవడం మంచిది అప్పుడు మీరు మీ కుటుంబం కూడా ఆనందంగా ఉంటుంది.

మూర్ఖుడైన శిష్యుడు:

మూర్ఖుడైన శిష్యుడు కనుక ఉంటే జీవితం నరకప్రాయంగా ఉంటుంది. తన శిష్యుడికి జీవితంలో ఎదురయ్యే ప్రతి కష్టాన్ని కూడా దాటాలని గురువు బోధిస్తాడు. అయితే శిష్యుడు మూర్ఖులు అయితే ఎంతటి పాండిత్యము ఉన్న గురువు అయినా ఏమి బోధించలేడు పైగా అలాంటి గురువుకి గౌరవం ఉండదు.

Read more RELATED
Recommended to you

Latest news