జైలుశిక్ష అంటే ఎలా ఉంటుందో మనం సినిమాల్లో చూస్తుంటాం. తప్పించుకునే ప్రయత్నాలు చేస్తే చితకబాదుతారు. ఒకవేళ తప్పించుంటే..వెతికి మళ్లీ పట్టుకొస్తారు. శిక్షాకాలం ఇంకా పెరుగుతుంది. సో జైలు నుంచి తప్పించోవటం ఇంకా పెద్ద నేరం కదా. కానీ మీకు ఇది తెలుసా..కానీ, కొన్ని దేశాల్లో ఖైదీలు జైలు నుంచి పారిపోతే వారికి పూర్తి స్వేచ్ఛ లభించినట్లేనట. వారికి విధించిన జైలు శిక్షను కోర్టులు మాఫీ చేస్తాయట. ఓర్ని ఇదేక్కడి రూల్ రా బాబు అనుకుంటున్నారా..అలా అయితే..శిక్షపడ్డ ప్రతివాడు ఎలాగోలా ఎస్కేప్ అవ్వాలనే చూస్తాడుగా మరీ..ఇలా ఎందుకు పెట్టారో, దీని వెనుక అక్కడి అధికారుల స్కెచ్ ఏంటో చూద్దాం.
జర్మనీ, బెల్జియం, ఆస్ట్రియా, మెక్సికో, డెన్మార్క్ దేశాలు ఖైదీలు జైలు నుంచి పారిపోవడాన్ని నేరంగా పరిగణించవట. వాళ్లు ఏం అంటున్నారంటే.. ‘మనిషి స్వేచ్ఛను కోరుకుంటాడు. అది మనిషి స్వభావం. దాని కోసం తాపత్రయపడటంలో ఎలాంటి తప్పులేదు’ అనే సూత్రాన్ని ఈ దేశాలు బాగా నమ్ముతున్నాయి. అందుకే జైల్లో ఉండే ఖైదీ స్వేచ్ఛ కోసం జైలు నుంచి పారిపోతే.. దానిని ఆయా దేశాలు నేరంగా భావించట్లేదు
ఖైదీని ఎక్కడున్నా ఇక పట్టుకోరట. ఇలాంటి చట్టాన్ని జర్మనీ దేశంలోని చట్టసభ్యులు 1880లో తీసుకొచ్చారు. దీన్నే పలు దేశాలు ఇప్పట్టికీ పాటిస్తున్నాయి. అయితే, ఇందులో కొన్ని షరతులు ఉన్నాయట. వెళ్లిపోయే ఖైదీ..
జైలు ఆస్తులను ధ్వంసం చేయకూడదు. జైలు గోడలు బద్దలుకొట్టినా, తలుపులు, కిటికీలు విరగొట్టినా నేరం చేసినట్లే.
జైలు నుంచి పారిపోవడంలో ఇతరుల సాయం తీసుకోకూడదు..
ఎవిరినైనా బందీలుగా చేసుకొని పారిపోవాలని ప్రయత్నించినా పోలీసులు వారిని పట్టుకొని మళ్లీ జైలుకే పంపుతారు.
ఆఖరికి ఖైదీ దుస్తులతో పారిపోయినా నేరమే. ఆ దుస్తులు కూడా జైలు ఆస్తే కదా.
అంటే పారిపోవాలనుకున్న ఖైదీ.. ఖైదీ దుస్తులు విప్పేసి.. నగ్నంగా పైనా పేర్కొన్న ఏ తప్పు చేయకుండా పారిపోవాల్సి ఉంటుంది. అయ్యే..ఇదేంటి ఇంత పెద్ద ట్విస్ట్ ఇచ్చారు అనుకుంటున్నారు కదా..అలాంటి వారికే జైలు శిక్ష నుంచి విముక్తి లభిస్తుంది. వాటిలో ఏ తప్పు చేసినా మళ్లీ ఊచలు లెక్కించాల్సిందే. ఈ విధంగా పారిపోవడం దాదాపు అసాధ్యమే. నగ్నంగా బయటకు రావాలి అంటే ఎవరూ సాహసం చేయరు.. అందుకే ఈ చట్టాలని ఇంకా కొనసాగిస్తున్నారు. స్వేచ్ఛ ఇచ్చినట్లే ఇచ్చి భలే మెలికపెట్టాయి ఆ దేశాలు.