కమల్ హాసన్ ‘విక్రమ్’ రిలీజ్ డేట్ ఫిక్స్.. మేకర్స్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్..

-

లోకనాయకుడు కమల్ హాసన్ ప్రజెంట్ పాలిటిక్స్, సినిమాలు రెండూ చేస్తు్న్నారు. ఈ క్రమంలోనే ఆయన ఫుల్ బిజీగా ఉంటున్నారు కూడా. ‘ఖైదీ, మాస్టర్’ ఫేమ్ డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో విశ్వనటుడు కమల్ హాసన్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘విక్రమ్’. ఈ ఫిల్మ్ రిలీజ్ డేట్ ను మేకర్స్ బుధవారం అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.

 

ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్ ఆకట్టుకోగా, ఇందులో కమల్ హాసన్ మరోసారి తన నట విశ్వరూపం చూపిస్తారని అభిమానులు అంటున్నారు. ఈ పిక్చర్ లో కోలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి, మాలీవుడ్ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని ఈ ఏడాది జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు తెలిపారు.

ఈ మూవీ తెలుగు డబ్బింగ్ రైట్స్ రూ.11 కోట్లకు ఓ ప్రముఖ సంస్థ కొనుగోలు చేసినట్లు సమచారం. కమల్ హాసన్ నటించిన చిత్రాలన్నీ తెలుగులో విడుదలవుతుంటాయి. అయితే, ఇటీవల కాలంలో ఆయన నటించిన సినిమాలకు తెలుగులో పెద్దగా ఆదరణ లభించలేదు. ఈ నేపథ్యంలో ‘విక్రమ్’ చిత్రానికి కచ్చితంగా ఆదరణ లభిస్తుందని మూవీ మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారట.

ఈ చిత్రం పొలిటికల్ థ్రిల్లర్ కాగా, ప్రజెంట్ సొసైటీలో పేరుకుపోయిన సమస్యలన్ని ఇందులో ప్రస్తావిస్తారని సమాచారం. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ ఈ ఫిల్మ్ కు మ్యూజిక్ అందించారు. ఇక మూవీ మేకర్స్ రిలీజ్ చేసిన విడుదల తేదీ పోస్టర్ లో కమల్ హాసన్ ఇంటెన్స్ లుక్ లో చాలా వాయ్ లెంట్‌గా ఉన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news