RRR: ట్రిపుల్ ఆర్ రికార్డ్….6 రోజుల్లో రూ. 667 కోట్లు వసూలు

-

టాలీవుడ్ సత్తాను ప్రపంచానికి చాటుతోంది ‘ ఆర్ఆర్ఆర్’ మూవీ. ఈ నెల 25న ప్యాన్ ఇండియా సినిమాగా తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మళయాళ భాషల్లో విడుదలైన ట్రిపుల్ ఆర్ అన్ని భాషల్లో కూడా సంచలన క్రియేట్ చేస్తోంది. రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను రాబడుతోంది. బాహుబలి తర్వాత వస్తున్న రాజమౌళి సినిమా కావడంతో ట్రిపుల్ ఆర్ పై మొదటి నుంచి భారీ హైప్ నెలకొంది. మరోవైపు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా రావడంతో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.దీంతో అదే స్థాయిలో రికార్డులను కొల్లగొడుతోంది.

మార్చి 25న విడుదలైన ట్రిపుల్ ఆర్… 6 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 667 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. షేర్ రూ. 372.78 కోట్లను రాబట్టింది. ఏపీ, తెలంగాణలో కలిపి రూ. 270 కోట్లు రాబట్టింది. ఇక యూఎస్ లో రూ. 9.5 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇదిలా ఉంటే రానున్న రోజుల్లో మరింతగా కలెక్షన్లు రానున్నాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news