8వ తరగతి అర్హతతో పోస్టల్ జాబ్స్.. వివరాలివే..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్, ముంబై, మహారాష్ట్ర, ఇండియన్ పోస్ట్ నోటిఫికేషన్ ని విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా జనరల్ సర్వీస్ గ్రూప్ సి నాన్-గెజిటెటెడ్, నాన్ మినిస్ట్రియల్ పోస్టులను భర్తీ చెయ్యనున్నారు. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చెయ్యచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..

 

indian post
indian post

దీనిలో మొత్తం తొమ్మిది ఖాళీలు వున్నాయి. ఇక పోస్టుల వివరాల లోకి వెళితే.. మెకానిక్ – 5, ఎలక్ట్రీషియన్ – 2, టైర్మాన్ – 1, కమ్మరి – 1. ఇక ఎలా అప్లై చేసుకోవాలి అనేది చూస్తే.. ఆసక్తి వున్నవాళ్లు ఆఫ్‌లైన్ మోడ్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 9 మే 2022 సాయంత్రం 5 గంటల వరకు.

అర్హతల వివరాల లోకి వెళితే.. ప్రభుత్వం గుర్తించిన ఏదైనా సాంకేతిక సంస్థ నుండి ట్రేడ్‌లో సర్టిఫికేట్ లేదా సంబంధిత ట్రేడ్‌లో ఒక సంవత్సరం అనుభవంతో 8వ తరగతి ఉత్తీర్ణత అయ్యి ఉండాలి. మోటార్ వెహికల్ పోస్టుకి అప్లై చేసుకునే వారు హెవీ వెహికిల్ డ్రైవింగ్ లైసెస్ కలిగి ఉండాలి. ఇక పే స్కేల్ గురించి చూస్తే.. రూ. 19,900 – 7 వ CPC ప్రకారం పే మ్యాట్రిక్స్‌లో లెవెల్-2.

వయస్సు వివరాల లోకి వెళితే.. 01.07.2022 నాటికి 18 నుండి 30 సంవత్సరాలు కలిగి ఉండాలి. సెలెక్షన్ ప్రాసెస్ గురించి చూస్తే.. కాంపిటేటివ్ ట్రేడ్ టెస్ట్ ద్వారా అవసరమైన అర్హతలు, డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న అభ్యర్థులను మాత్రమే ఎంపిక చేస్తారు. పోస్టల్ అడ్రస్ The Senior Manager (JAG), Mail Motor Service, 134-A, Sudam Kalu Ahire Marg, Worli, Mumbai- 400018 కు దరఖాస్తును పంపాలి.

ఎంట్ర‌న్స్ ప‌రీక్ష‌ల కోసం ప్రిపేర్ అవుతున్నారా?? ప్ర‌భుత్వోద్యోగం మీ ల‌క్ష్య‌మా.. అయితే Manalokam’s Vijayapatham.com వెబ్‌సైట్‌లో ప్రాక్టీస్ బిట్స్ , ఆన్‌లైన్ ఎగ్జామ్స్ ద్వారా మీ నాలెడ్జ్‌ను పెంచుకోండి. మ‌రెన్నో ఇంట్రెస్టింగ్, వింత‌లు విశేషాలు, ప్రేర‌ణాత్మ‌క‌ క‌థ‌నాల కోసం మ‌న‌లోకం.కామ్ ని ఫాలో అవ్వండి.

Read more RELATED
Recommended to you

Latest news