వావ్.. ఈ హెల్మెట్ చాలా కూల్ గురూ..!

-

చలికాలం, వర్షాకాలం పర్లేదు కాని ఎండాకాలం వచ్చిందటే చాలు బైక్ నడిపే వాళ్లు తెగ చిరాకుపడుతుంటారు. రోడ్డు మీద హెల్మెట్ పెట్టుకోకపోతే పోలీసులకు కోపం.. పెట్టుకుంటే చెమటలతో తడవడం.. ఇలా బైకర్లు అనుభవించే కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఏంచక్కా కారు కొనుక్కొని ఫుల్లు ఏసీ వేసుకొని పోవాలనిపిస్తుంటుంది ఒక్కోసారి. కానీ.. కారు కొనడం అందరికీ కుదరదు కదా. కానీ.. బైక్‌నే కూల్‌గా మార్చేస్తే పోలా.. అదిరిపోలా అనుకుంది ఓ కంపెనీ. అలా వచ్చిందే ఫస్ట్ ఏసీ హెల్మెట్. ఫెహెర్ అనే కంపెనీ ఏసీ యూనిట్‌తో ఏసీహెచ్1 అనే ఈ హెల్మెట్‌ను తయారు చేసింది.

వాతావరణంలో వచ్చే మార్పులకు అనుగుణంగా విపరీతమైన వేడి ఉన్నప్పుడు బైక్ నడిపే వ్యక్తికి చల్లదనాన్ని అందించడమే ఈ హెల్మెట్ మోటో. ఇది కేవలం తలను మాత్రమే చల్లబరుస్తుంది. దీంతో బయట ఎంత వేడి ఉన్నా బండి నడిపే వ్యక్తికి చిరాకు వేయదు. చెమట రాదు. తల భాగం చల్లగా ఉంటుంది. 15 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకూ టెంపరేచర్‌ను ఇందులో సెట్ చేసుకోవచ్చు.

బైక్‌కు ఉన్న బ్యాటరీ ద్వారానే ఈ ఏసీ హెల్మెట్ నడుస్తుంది. ఫైబర్ మ్యాట్, ఫైబర్ గ్లాస్‌ను ఉపయోగించి తయారు చేసిన ఈ ఏసీ హెల్మెట్ బరువు కూడా తక్కువే. 1.45 కిలోల బరువే ఉంటుందట. కాకపోతే దీని ధరే కాస్త ఎక్కువ. 549 డాలర్లు.. అంటే మన కరెన్సీలో రూ.40 వేలు. రీసెంట్‌గా ఇండియాలో దీన్ని కంపెనీ లాంచ్ చేసింది. ఇంకా దీని గురించి మీకు వివరాలు కావాలంటే మాత్రం ఈ వీడియోను చూడాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news