వేములవాడలో దారుణం..చికెన్‌ వాసన వస్తుందని యాజమానిపై యాసిడ్‌తో దాడి

-

ఈ మధ్య కాలంలో.. జనాలు చిన్న, చిన్న విషయాలకు సైకోలుగా మారిపోతున్నారు. చిన్న విషయానికి మర్డర్లు, దాడులకు ఒడిగడుతున్నారు. అయితే.. తాజాగా చికెన్‌ వాసన వస్తుందని.. ఆ చికెన్‌ సెంటర్‌ నిర్వాహకులపై యాసిడ్‌ దాడి చేశారు. ఈ సంఘటన రాజన్న సిరిసిల్లా జిల్లా వేములవాడలోని తిప్పపూర్ లో చోటు చేసుకుంది.

చికెన్ కొనుగులు విషయంలో ఇరువర్గాల మధ్య.. చికెన్ సెంటర్ నిర్వహుకుల పై యాసిడి దాడి…దాకా వెళ్లింది. గత కొంత కాలంగా రాజన్న అలయ ప్రాంతంలో చిరు వ్యాపారం చేస్తున్నాయి కొన్ని కుటుంబాలు. అయితే.. ఈ నేపథ్యంలోనే.. చికెన్ కోసం తిప్పపూర్ వెళ్లారు ఆ చిరు వ్యాపారులు.

ఆ చికెన్‌ కాస్త వాసనగా ఉండటంతో.. ఆ నిర్వాహకులపై చిరు వ్యాపారులు ఘర్షణకు దిగారు. ఈ నేపథ్యంలోనే.. ఇరు వర్గాలు దాడి చేసుకున్నాయి. అక్కడితో ఆగకుండా…చికెన్‌ సెంటర్ నిర్వహుకులైన 10 మంది పై యాసిడి దాడి చేశారు చిరు వ్యాపారులు. దీంతో స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. ఇక ఘటనలో గాయపడ్డ ఒక్కరి పరిస్తితి విషమంగా ఉంది. ప్రస్తుతం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news