ఇల్లు కట్టుకునే వారికి ఏపీ ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌..రూ. 3 లక్షల రుణాలు మంజూరు!

-

జగనన్న కాలనీల్లో పెద్దగా ఇళ్లు కట్టుకోవాలని అనుకునే వారికి.. జగన్‌ మోహన్‌ రెడ్డి సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. లబ్దిదారులకు రూ.3 లక్షల వరకు రుణాలు ఇవ్వనున్నట్లు తాజాగా ప్రకటన చేసింది సర్కార్‌. ఈ మేరకు రుణాలు మంజూరు కార్యక్రమానికి రాష్ట్ర గృహ నిర్మాణ మత్రి చెరుకువాడ శ్రీ రంగ నాథ రాజు, శాసన మండలి ఛైర్మన్‌ కొయ్యే మోషేన్‌ రాజు శ్రీకారం చుట్టారు.

పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజక వర్గం పోడూరు మండలం తూర్పు పాలెంలో జరిగిన కార్యక్రమంలో.. హోం లోన్స్‌ మంజూరు చేసిన ఐఐఎఫ్‌ఎల్‌ సంస్థ ప్రతినిధులతో కలిసి లబ్దిదారులకు రుణ మంజూరు పత్రాలను అందజేశారు. జగనన్న కాలనీల్లో 350 చదరపు అడుగుల నిర్మాణం చేపట్టేందుకు రూ.1.80 లక్షల రుణాన్ని ప్రభుత్వం లబ్దిదారులకు అందిస్తోంది. అయితే.. కొంత మందిద కొంచెంద పెద్ద ఇళ్లనిర్మణానికి మొగ్గుచూపుతూ బయట వ్యక్తుల వద్ద అధిక వడ్డీలతో రుణం తీసుకుంటున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news