ఫ్యాక్ట్ చెక్: అసలు ఈ ఆర్గనైజేషన్ వుందా..? ప్రభుత్వంతో నిజంగానే జతకట్టిందా..?

-

మనకి ఫేక్ వార్తలు కొత్తేమీ కాదు. తరచూ ఏదో ఒక వార్త వస్తుంటుంది. నిజానికి ఇలాంటి వార్తలతో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే అనవసరంగా మనం ఎదుర్కొనే అవకాశం ఉంది. సోషల్ మీడియాలో స్కీములు మొదలు ఉద్యోగాల వరకు చాలా నకిలీ వార్తలు వస్తూ ఉంటాయి. నిజానికి వాటిలో ఉన్నట్లుగా మీరు డబ్బులు కట్టేసారు అంటే చిక్కుల్లో పడినట్లే.

 

తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త వచ్చింది. ఐతే ఇందులో నిజమెంత అనేది ఇప్పుడు చూద్దాం. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వాడకం బాగా పెరిగింది. దీంతో వెబ్ సైట్లు కూడా తెగ వస్తున్నాయి. ఫ్రాడ్స్టర్స్ కూడా ఏదో ఒక ఫేక్ వెబ్ సైట్ ని క్రియేట్ చేయడం… దాని ద్వారా జనాల్ని మోసం చేయడం జరుగుతోంది. ‘ https://gusindia.co.in ‘ అనే ఒక ఫేక్ వెబ్సైట్ వచ్చింది. అయితే ఇది రిక్రూట్మెంట్ అవకాశాలను కల్పిస్తున్నట్లు అందులో ఉంది.

నిజంగా ఈ వెబ్ సైట్ ను నమ్మి ఉద్యోగావకాశాలను ప్రభుత్వం తో కలిపి ఇది అందిస్తోంది అనే విషయానికి వస్తే… ఇది నకిలీ వార్త అని తెలుస్తోంది. ఇందులో ఏ మాత్రం నిజం లేదు. ఇలాంటి ఫేక్ ఆర్గనైజేషన్స్ తో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే అనవసరంగా మీకు చిక్కులు తప్పవు. దీనిపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్ కూడా స్పందించింది. ట్విట్టర్ వేదికగా ఇది నకిలీ వార్త అని చెప్పింది.

ఇలాంటి ఆర్గనైజేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తో అసోసియేట్ అవ్వలేదని క్లియర్ గా పీఐబీ ఫ్యాక్ట్ చెప్పేసింది. కాబట్టి ఇలాంటి నకిలీ వార్తలకు దూరంగా ఉండటం మంచిది అలాగే ఎవరికి ఇలాంటి వార్తలు షేర్ చేయకండి. వాళ్లు కూడా ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news