నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఏడేండ్ల చిన్నారిని అపహరించిన దుండగులు చేతులు కాళ్లు కట్టేసి నిజాంసాగర్ కాలువలో పడేసి హత్య చేశారు. పాతకక్షల కారణంగానే చిన్నారిని హత్య చేసిన్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుల గుర్తించేందుకు చర్యలు చేపట్టారు.
నిజామాబాద్ ఆటోనగర్ కొత్త వంతెన ప్రాంతానికి చెందిన మహ్మద్ ఫయాజ్(7) గురువారం మధ్యాహ్నం 3.30గంటలకు అదృశ్యమయ్యాడు. కుటుంబ సభ్యులు గాలించినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం మధ్యాహ్నం బాబాన్‌సాహెబ్ పహాడ్ సమీపంలోని కాలువలో ఫయాజ్ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. ఇద్దరు మహిళలు బురఖా వేషధారణలో వచ్చి ఆటోలో బాలుడిని కిడ్నాప్ చేసినట్లుగా పోలీసులకు సమాచారం అందింది.