శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం చేయి దాటిపోతుంది. నిత్యవసర వస్తువుల ధరలు భగ్గుమంటున్నాయి. అలాగే రోజుకు 13 గంటల కరెంట్ కోతలు విధుస్తున్నారు. దీంతో శ్రీలంక దేశ ప్రజలు రోడ్డుపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. శ్రీలంక దేశ వ్యాప్తంగా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఆ దేశ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స సంచలన నిర్ణయం తీసుకున్నారు. శ్రీలంకలో ఎమెర్జెన్సీ విధించారు. శ్రీలంక లో అత్యవసర పరిస్థితిని విధిస్తూ.. నిన్న రాత్రి నిర్ణయం తీసుకున్నారు. అంతే కాకుండా.. అందు కోసం ప్రత్యేకంగా ఒక గెజిట్ ను కూడా విడుదల చేశారు.
శ్రీలంకలో ఏప్రిల్ 1 వ తేదీ నుంచే అత్యవసర పరిస్థితి అమల్లోకి వచ్చినట్టు శ్రీలంకలో అధ్యక్షుడు కొటబాయ రాజపక్స ప్రకటించారు. కాగ శ్రీలంక లో ఆర్థిక సంక్షోభం కరోనా వైరస్ వ్యాప్తి నుంచి మొదలైంది. థర్డ్ వేవ్ వచ్చే సరికి శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం బాగా ముదిరింది. నిత్యవసర వస్తువుల ధరలు భారీగా పెరిగాయి.
కరెంటు కోతలు ఇలా అనేక ఇబ్బందులు శ్రీలంక ప్రజలు ఎదుర్కొంటున్నారు. అయితే శ్రీలంక లో ఆర్థిక పరిస్థితి ఇలా కావడానికి కారణం.. ఆ దేశ అధ్యక్షుడు రాజపక్సనే అంటు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధ్యక్షుడు రాజపక్స ఇంటి ముందు కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ ఆందోళన ఉద్రిక్తత పరిస్థితులకు దారితీసింది.