Ajith : విలక్షణ వ్యక్తి అజిత్ కుమార్.. ఆయన కథ ఇదే..

-

జనరల్ గా వరుసగా నాలుగు సినిమాలు హిట్ అయితే చాలు.. ఏ హీరోకు అయినా అభిమాన సంఘాలు పుట్టుకురావడం సహజం. ఈ క్రమంలోనే ఆ కథనాయకుడికి ఏదో ఒక టైటిల్ ఇచ్చేస్తుంటాయి సినీ వర్గాలు. ఆ టైటిల్ ను సదరు హీరో తన ప్రతీ సినిమాలో వేసేసుకుంటారు కూడా. ఈ సంగతి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందరికీ ఈ విషయం దాదాపుగా తెలిసినదే. అటువంటి గ్లామర్ ఫీల్డ్ లో ఉండి కూడా తను మాత్రం అందరి కంటే వెరీ డిఫరెంట్ గా ఉంటున్నారు. అతనే అజిత్ కుమార్..

కోలీవుడ్ స్టార్ హీరోగా కంటే కూడా తనను అజిత్ కుమార్ గానే పిలుస్తేనే ఆయన ఎక్కువ ఇష్టపడుతారు. అది ఆయన వ్యక్తిత్వం. పబ్లిసిటీకి దూరంగా తన పని మాత్రమే తాను చేసుకుంటూ ముందుకెళ్తుంటారు అజిత్. తను చిత్రాల్లో పోషించే కథానాయకుడి పాత్రల కంటే కూడా నిజ జీవితంలో ఇంకా బాగుండాలని అనుకుంటారు ఈ రియల్ హీరో. అటువంటి విలక్షణ వ్యక్తిత్వం అజిత్ కుమార్ ది అని చెప్పొచ్చు.

ఆయన తను అనుకున్నది స్పష్టంగా మాట్లాడేస్తుంటాడు. ఒకనాడు ఆయన మాట్లాడిన మాటలను గుర్తు చేసుకుందాం.. తమిళనాడు సీఎంగా కరుణానిధి ఉన్న రోజులవి..సినీ అభిమానులతో, అధికార పార్టీ నేతలు, కార్యకర్తలతో హాలు కిక్కిరిసి ఉంది. ఆ టైంలో సినీ ప్రముఖుల తరఫున మాట్లాడానికి ముందుకొచ్చాడు అజిత్ కుమార్..ఆయన మాట్లాడుతూ సినీ పరిశ్రమ మేలు కోసం సీఎంగారు పని చేస్తున్నారని చెప్పారు. అనంతరం తనది ఓ రిక్వెస్ట్ ఉందని తెలిపాడు.

అదేంటంటే..మీ పార్టీలోని కొందరు సినిమా వాళ్లను బెదిరించి మరీ మీ కార్యక్రమాలకు తీసుకెళ్తున్నారండీ.. దయచేసి వారిని కంట్రోల్ చేయాలని అజిత్ తమిళనాడు సీఎంను రిక్వెస్ట్ చేశాడు. ఆ మాటలకు హాల్ అంతా ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది. అంతలోనే అటుగా కూర్చొన్న ఓ వ్యక్తి ఈల వేశాడు. ఆయన ఎవరో కాదు సూపర్ స్టార్ రజనీకాంత్. అంతే.. అందరూ చప్పట్లు కొట్టేశారు. నిజానికి తమిళనాడు అధికార పార్టీని, సీఎంను విమర్శించారు అజిత్ కుమార్. కానీ, అది సహేతుకమైన విమర్శ. అలా తన అభిప్రాయాన్ని స్పష్టం గా చెప్పాడు అజిత్.

తనను తల అని కాకుండా అజిత్ కుమార్ అని పిలవాలని ఆయన ఇప్పటికీ చెప్తుంటారు. ఈయన తెలుగులోనే తన కెరీర్ స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత తమిళ్ భాషలో సినిమాలు చేసి సక్సెస్ అందుకున్నాడు. రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం తనకు లేదని స్పష్టంగా చెప్పడమే కాదు, తనకున్న అభిమాన సంఘాలన్నిటినీ రద్దు చేసిన డేరింగ్ పర్సన్ అజిత్.

అభిమాన సంఘాల వల్ల మీ సమయం వృథా అవుతుందని, కాబట్టి మీ టైం మీ కెరీర్, కుటుంబం పైన పెట్టండని అభిమాన సంఘాలను రద్దు చేసిన తర్వాత పేర్కొన్నాడు. ఈ మేరకు స్పష్టమైన ప్రకటన ఇచ్చి తను అందరిలోకెల్లా డిఫరెంట్ పర్సన్ అని స్పష్టం చేసిన అజిత్ కుమార్ రియల్లీ గ్రేట్..

Read more RELATED
Recommended to you

Latest news