సోషల్ మీడియా కార్యకర్తలకు అండగా వైసీపీ అధినేత.. నేనున్నానంటూ భరోసా..

-

వైసీపీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్తలను పోలీసులు అరెస్టులు చేస్తున్నారు.. సోషల్ మీడియాలో ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారని కేసులు నమోదు చేస్తున్నారు..అర్దరాత్రి సమయాల్లో అరెస్టులు చేసి.. స్టేషన్లు తిప్పిస్తున్నారు.. ఈ నేపధ్యంలో వారికి అండగా ఉండేందుకు వైసీపీ అధినేత జగన్ సిద్దమయ్యారు.. ముఖ్యనేతలతో అత్యవసరంగా సమావేశయ్యారు..

సోషల్ మీడియాలో పోస్టులపై కూటమి సర్కార్ కేసులు పెట్టి, జైలుపాలు చేస్తూ, వేధిస్తుండడాన్ని జగన్ సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది.. వందల మందిని అరెస్టులు చేసి స్టేషన్లకు తీసుకెళ్తున్న నేపథ్యంలో వారికి అండగా నిలబడాలని ఆయన నిర్ణయించుకున్నారట.. ఇందుకోసం ప్రత్యేకంగా లీగల్ సెల్ ఏర్పాటుకు ఆదేశాలిచ్చారు..దాంతో పాటు.. కార్యకర్తలను అరెస్టు చేసిన వెంటనే.. కేంద్ర కార్యాలయానికి తెలిసేలా ఒక ప్రత్యేకమైన టీమ్ ను కూడా ఏర్పాటు చేసినట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి..

పార్టీపేరుతోనే వైసీపీ యాక్టివిస్టులు తమ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిస్తే..వారిని అరెస్టు చేసే అవకాశం ఉండదని జగన్ ఆలోచిస్తున్నారట.. ఏవైనా కేసులు పెట్టాల్సి వస్తే, అధ్యక్షుడైన తానే ఆ బాధను అనుభవిస్తానని, సమస్య ఎదుర్కొంటానని జగన్ చెప్పినట్టు పార్టీ ముఖ్యనేతలు చర్చించుకుంటున్నారు.. పార్టీకోసం కష్టపడి కేసులు పెట్టించుకుంటున్న నేతలకోసం న్యాయ పోరాటం చేస్తామని జగన్ నేతలకు సూచించారట..

జమిలి ఎన్నికల రాబోతున్నాయని.. అప్పటిదాకా క్యాడర్ ను కాపాడుకోవాలని అధినేత భావిస్తున్నారట.. జోష్ లో ఉన్న వైసీపీ క్యాడర్ ను భయబ్రాంతులకు గురిచెయ్యాలని కూటమి ప్రభుత్వం చూస్తోందట..అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చెయ్యడం.. పోలీసులు యాక్షన్ షురూ చెయ్యడం చకచకా జరిగిపోయాయి.. దీంతో పార్టీ పేరు మీదే పోస్టులు వైరల్ చేస్తే.. కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని.. ఆదిశగా ఆలోచనలు చెయ్యాలని సోషల్ మీడియా వింగ్ కు జగన్ ఆదేశాలిచ్చారట.. ఇది ఎంత మేరకు వర్కౌట్ అవుతుందో చూడాలి..

Read more RELATED
Recommended to you

Latest news