భార్య భర్తల మధ్య ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అవసరం. ఈ విధంగా కనుక ఎమోషనల్ ఇంటెలిజెన్స్ తో ఉంటే వాళ్ళ బంధానికి ఎటువంటి ప్రమాదం కలగదు. వాళ్ళ మధ్య ఇబ్బందులు కూడా రావు. అయితే మరి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉన్న వాళ్ళు ఎలా ఉంటారో చూద్దాం.
ఎప్పుడూ కూడా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉన్న భార్య భర్తలు ఇద్దరి మధ్య మంచి కనెక్షన్ ని ఏర్పరచుకోవడానికి చూస్తారు. అలానే కనెక్షన్ ని బలంగా వుంచుకోవడానికి చూస్తారు.
ఇద్దరూ కలిసి సమయాన్ని గడపడానికి.. కలిసి ఇద్దరూ పనులు చేసుకోవడానికి ఇష్టం చూపిస్తారు.
అలానే వీళ్ల మధ్య గొడవలు చాలా తక్కువగా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఇద్దరూ కూడా ఎమోషన్స్ ని బ్యాలెన్స్ చేసుకోగలరు. అలాగే ఒకరు చెప్పిన విషయాన్ని మరొకరు ఎంతో చక్కగా అర్థం చేసుకోగలరు కూడా.
ఫీలింగ్స్ ని కూడా కంట్రోల్లో ఉంచుకోగలరు. దీంతో కోపాన్ని కూడా వీళ్ళు వదిలేస్తారు.
అలానే ఒకరి ప్రెజెన్స్ ని ఒకరు కోరుకుంటారు. ఇద్దరు కలిసి ఉండడానికి చూస్తూ ఉంటారు.
నిజానికి వీళ్ళు మంచి స్నేహితులు కూడా. వీళ్ళిద్దరూ పార్ట్నర్స్ అయినప్పటికీ కూడా మంచి స్నేహితుల్లా ఉంటారు. అలాగే ఒకరు మరొకరి అభివృద్ధి కోసం కోరుకుంటారు. వీలైతే వాళ్ల సహకారం కూడా అందిస్తారు.