అరుదైన రికార్డు.. ఆ దేశంలో విడుదలవుతున్న తొలి దక్షిణాది చిత్రం ‘కేజీఎఫ్ 2’

-

శాండల్ వుడ్ రాకింగ్ స్టార్ యశ్ నటించిన ‘కేజీఎఫ్’ చిత్రం ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలై సూపర్ సక్సెస్ అయింది. ప్రపంచవ్యాప్తంగానూ ఈ చిత్రానికి మంచి పేరు వచ్చింది. చాప్టర్ 2 ఎప్పుడు వస్తుందా? అని సినీలవర్స్ ఈ క్రమంలోనే ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ నెల 14న ఫిల్మ్ రిలీజ్ కానుంది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీలో యశ్ సరసన హీరోయిన్ గా శ్రీనిధి శెట్టి నటించింది.

పాన్ ఇండియా వైడ్ గా మూవీ ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారు మూవీ యూనిట్ సభ్యులు. ఈ క్రమంలోనూ మూవీ టీమ్ కు ఓ గూడ్ న్యూస్ తెలిసింది. కేజీఎఫ్ 2 విడుదల కాక ముందే ఆ సినిమా ఖాతాలో ఓ అరుదైన రికార్డు నమోదైంది. గ్రీస్ దేశంలో విడుదలవుతున్న తొలి దక్షిణాది చిత్రంగా ఇది నిలవడం విశేషం.

పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కాబోతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్స్ సంజయ్ దత్, రవీన్ టండన్ నటించారు. ‘అధీర’ పాత్రలో సంజయ్ దత్ లుక్ చాలా డిఫరెంట్ గా ఉంది. హోంబ‌లే ఫిల్మ్స్ బ్యాన‌ర్‌పై విజ‌య్ కిర‌గండూర్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీకి ర‌వి బ‌స్రూర్ మ్యూజిక్ అందిస్తున్నారు.

అమ్మ సెంటిమెంట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల ఫేవరెట్ మూవీగా ఉండబోతుందని మూవీ యూనిట్ సభ్యులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. చాప్టర్ వన్ ను మించిన విజ్యువల్స్, ఎమోషన్స్ చాప్టర్ టూలో ఉంటాయని పేర్కొ్ంటున్నారు. ఈ నెల 13న కోలీవుడ్ స్టార్ హీరో నటించిన ‘బీస్ట్’ ఫిల్మ్ రిలీజ్ కానుంది. కాగా, నెక్స్ట్ డే ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ విడుదల అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news