ఎండలు మండిపోతున్నాయి. రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ప్రజలు ఏసీలు, కూలర్లకు పనిచెప్పే కాలం వచ్చింది. ఇప్పటికే చాలా మంది ప్రజలు తమకున్న బడ్జెట్ లో ఏసీలు కొనేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే అలాంటి వారందరికి షాకింగ్ వార్త. త్వరలోనే ఏసీల ధరలు భారీగా పెరుగనున్నాయి. దీంతో ఏసీలు కొనేవారు మరోమారు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
దాదాపుగా 5 శాతం వరకు ఏసీల ధరలు పెరగనున్నాయి. ముడిసరకుల కొరతతో సంస్థలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. ముడిసరుకులు కొరత కారణంగా కంపెనీలపై విపరీతమైన భారం పడుతోంది. దీంతో కంపెనీలు రేట్లను పెంచాయి. అయితే ఈ సీజన్ లో అమ్మకాలు భారీగా ఉంటాయని అంచానా వేసుకుంటున్నాయి కంపెనీలు. కాగా తయారీ భారాన్ని తగ్గించుకునేందుకు ఉత్పత్తుల ధరలను 5 శాతం పెంచుతున్నారు. దీంతో ఒక్కో ఏసీ ధర రూ. 3-5 వేల వరకు పెరిగే అవకాశం ఉంది. దీంతో వినియోగదారుడిపై మరింతగా భారం పడే అవకాశం ఉంది.