ఆపిల్ కేజీ రూ. 1000, కేజీ పాలపొడి రూ. 1990… ఇది శ్రీలంక పరిస్థితి

-

తీవ్ర ఆర్థిక, ఆహర సంక్షోభంతో ద్వీప దేశం శ్రీలంక అతలాకుతలం అవుతోంది. తినడానికి తిండి కూడా దొరకని పరిస్థితి ఏర్పడుతోంది ఆదేశంలో. నిత్యావసరాల ధరలు చుక్కలను అంటుతున్నాయి. కనీసం అంత ధరలు పెట్టి కొందాం అని అనుకున్నా సరుకులు లేని పరిస్థితి ఉంది. ఇంధన సరఫరా లేక దేశం అల్లాడుతోంది. ప్రజలు పెట్రోల్, గ్యాస్ స్టేషన్ల వద్ద గంటల తరబడి నిలుచోవాల్సి వస్తోంది. వీటి వద్ద సైన్యాన్ని కాపలా పెడుతున్నారంటే… ఆదేశ పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరో వైపు ప్రజల్లో అసహనం పెరిగిపోతోంది. అధ్యక్షుడు గోటబయ రాజపక్సే గద్దెదిగి పోవాలంటూ…. ప్రజలు ఆందోళన చేస్తున్నారు. 

శ్రీలంకలో పసిపిల్లలకు పాలు పట్టేందుకు కూడా పాటు దొరకని పరిస్థితి ఉంది. కేజీ పాలపొడి రూ. 1900, కేజీ బియ్యం రూ. 220, చెక్కర రూ. 240, లీటర్ కొబ్బరి నూనె రూ. 850గా ఉంది. చికెన్, కోడిగుడ్ల వీటి ధరలు కూడా చుక్కలను అంటుతున్నాయి. ఇక పండ్ల ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. కేజీ ఆపిల్ ధర రూ. 1000. ఇంత ధరలు పెట్టి కొందాం అనుకున్న ప్రజల వద్ద డబ్బుల లేవు.

Read more RELATED
Recommended to you

Latest news