హైదరాబాద్ లోని బోలక్ పూర్ ఎంఐఎం కార్పోరేటర్ పై తెలంగాణ మంత్రి కేటీఆర్ సీరియస్ అయ్యారు. ఆ ఎంఐఎం కార్పోరేటర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి కి కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు. నెలరోజులు కనిపించ వద్దని పోలీసులకు భోలక్పూర్ కార్పోరేటర్ వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో మంత్రి కేటీఆర్ స్పందించారు.
పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తే సహించేది లేదని మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. తెలంగాణలో ఇలాంటి వాటిని సహించేది లేదని హెచ్చరించారు. ఏ రాజకీయ పార్టీతో సంబంధం ఉన్నా వారిని వదలకూడదు అని స్పష్టం చేశారు మంత్రి కేటీఆర్.
కాగా.. నిన్న మధ్యాహ్నం.. బోలక్ పూర్ MIM కార్పొరేటర్.. తెలంగాణ పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. తాను ఈ ఏరియాకు రావద్దని చెప్పినా.. మళ్లీ ఎందుకు వస్తున్నారంటూ.. పోలీసులకు బెదిరించాడు బోలక్ పూర్ MIM కార్పొరేటర్. అయితే.. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా కావడంతో.. కేటీఆర్ స్పందించారు.
@TelanganaCMO @trsharish @KTRTRS @bandisanjay_bjp @Eatala_Rajender @DineshKarthik @Arvindharmapuri @RaghunandanraoM
This is the old city for you. MIM corporator shouts on police & calls how dare you to come to our place. You police people are 100 value people. Oh my god https://t.co/RaCRCnOl6T— Ambala Rajkumar (@rajkumar15_a) April 5, 2022
Request @TelanganaDGP Garu to take stern action against the individuals who obstructed police officers on duty
No such nonsense should be tolerated in Telangana irrespective of political affiliations https://t.co/zLbxa8WZW2
— KTR (@KTRTRS) April 6, 2022