కేంద్ర ప్రభుత్వం షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల వారితో పాటు, మహిళలకు రుణాలు ఇవ్వడం కోసం స్టాండ్‌అప్ ఇండియా స్కీమ్ ని మొదలు పెట్టింది. వీళ్ళు వ్యాపారాలను నిర్వహించేందుకు ఈ స్కీమ్ సహాయం అందిస్తుంది. ఈ స్కీమ్ గత ఆరేళ్ళ నుండి వుంది. ఈ ఏడాది మార్చి 21 వరకు 1,33,995 మంది ఈ రుణాలు ఈ స్కీమ్ ద్వారా పొందారు. ఇక దీని కోసం పూర్తి వివరాలను చూస్తే..
ఈ స్కీమ్ పేరు స్టాండ్‌అప్ ఇండియా స్కీమ్. ఈ పథకం ద్వారా లక్ష మందికి పైగా మహిళా ప్రమోటర్లు లాభపడ్డారని తెలిపారు. ఆర్థిక సాధికారత, ఉద్యోగ కల్పనపై దృష్టి సారించి అట్టడుగు స్థాయిలో ఆంట్రప్రెన్యూర్‌షిప్ ప్రోత్సహించాలనే లక్ష్యంతో కేంద్రం దీనిని తీసుకు వచ్చింది. ఈ పథకం ద్వారా మహిళలకు రూ.10 లక్షల నుంచి రూ.1 కోటి వరకు లోన్ పొందొచ్చు.
ప్రతీ బ్యాంకులో కనీసం ఒక్కరికైనా ఈ పథకం కింద లోన్ ఇవ్వాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. స్టాండ్‌అప్ ఇండియా స్కీమ్ ద్వారా 18 ఏళ్లు దాటినవారు ఎవరైనా లోన్ తీసుకోచ్చు. వ్యాపారంలో ఎస్‌సీ, ఎస్‌టీ వర్గాలవారు, మహిళలకు కనీసం 51 శాతం షేర్‌హోల్డింగ్ ఉండాలి.
ఏదైనా షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ బ్రాంచ్‌లో ఈ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. లేదా స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాండప్ ఇండియా పోర్టల్ https://www.standupmitra.in/ ద్వారా అప్లై చెయ్యచ్చు. ఆన్‌లైన్‌లో కూడా లోన్‌కు అప్లై చెయ్యచ్చు. అది ఎలా అనేది చూస్తే..
దీని కోసం ముందుగా https://www.standupmitra.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
హోమ్ పేజీలో Apply Here పైన క్లిక్ చేయాలి.
నెక్స్ట్ మీకో కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
New Entrepreneur, Existing Entrepreneur, Self Employed Professional ఆప్షన్స్‌లో ఉంటాయి. ఒక ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి.
పేరు, ఇమెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్ ఎంటర్ చెయ్యండి.
ఇప్పుడు ఓటీపీ జనరేట్ చేయాలి.
ఆ తరవాత రిజిస్ట్రేషన్ ఫామ్ పూర్తి చేయాలి.
వ్యాపారం వివరాలు, లోన్ వివరాలు ఎంటర్ చేయాలి.
డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసి లోన్ కోసం దరఖాస్తు చేయాలి.