హైదరాబాద్ లో ఎంఐఎం కార్పొరేటర్లు రెచ్చిపోతున్నారు. తమకు చట్టాలు, నియమాలు పట్టవు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇది సరికాదని చెబుతున్న పోలీసులపై జులుం ప్రదర్శిస్తున్నారు. ఇటీవల భోలక్ పూర్ లో ఎంఐఎం కార్పొరేటర్ గౌసుద్దీన్ పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అర్థరాత్రి సమయంలో గస్తీకి వచ్చిన పోలీసులపై…. 100 రూపాయల వ్యక్తులంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆతరువాత కేటీఆర్ ట్వీట్ తో పోలీసులు చర్యలు తీసుకున్నారు. గౌసుద్దీన్ ను అరెస్ట్ చేశారు.
తాాజాగా హైదరాబాద్ పాతబస్తీలో మరో ఎంఐఎం కార్పొరేటర్ పోలీసులపై రెచ్చిపోయాడు. భోలక్ పూర్ ఘటన మరవకు ముందే ఈ ఘటన చోటు చేసుకుంది. పాతబస్తీ పత్తర్ గట్టి ఎంఐఎం కార్పొరేటర్ సోహైల్ ఖాద్రి జులుం ప్రదర్శించారు. యునాని ఆస్పత్రి ముందు నో పార్కింగ్ జోన్ లో వాహనాన్ని నిలిపాడు. నోపార్కింగ్ లో ఉన్న వాహనాన్ని తీయమన్నందుకు గొడవ ప్రారంభం అయింది. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి వచ్చిన ఎస్సైతో కార్పొరేటర్ వాగ్వాదానికి దిగారు. పోలీస్ పవర్ ఇక్కడ చూపిస్తామంటే నడవదని హెచ్చరించారు. ఇక్కడ ఇలాగే చేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు.