IPL 2022: 10 ఏళ్ళ నాటి జడేజా చెత్త రికార్డును బ్రేక్ చేసిన భువనేశ్వర్..

-

ఎంతో నైపుణ్యం ఉన్న బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ ఒకరు.అనుభవజ్ఞుడైన భారత పేసర్ గా చాలా కాలంగా T-20 అంతర్జాతీయ క్రికెట్లో, ఐపీఎల్ లో క్రమశిక్షణతో కూడిన బౌలింగ్ కు ప్రసిద్ధి చెందాడు.అయితే కొన్నిసార్లు వేసుకున్న ప్రణాళికలు దారి తప్పి ఛాన్స్ కూడా ఉంటుంది.Ipl 2022 గుజరాత్ టైటాన్స్- సన్ రైజర్స్ హైదరాబాద్ కి జరిగిన మ్యాచ్లో భువనేశ్వర్ కు అలాంటిదే జరిగింది.

మొదటి ఓవర్లోనే భువనేశ్వర్ ఘోరమైన తప్పిదాలు చేశాడు.చాలా పేలవమైన రికార్డు నమోదు చేశాడు.ఏప్రిల్ 11వ తేదీ సోమవారం నాడు ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్ మొదట బౌలింగ్ చేసింది.ఎప్పటిలాగే స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ ప్రారంభించి తొలి ఓవర్లోనే భారీగా పరుగులు సమర్పించాడు.వేసిన తొలి బంతికే గుజరాత్ ఓపెనర్ మాథ్యూ వెడ్ బ్యాట్ కు తగిలి బౌండరి వద్దకు వెళ్ళింది.ఆ తర్వాతి బంతి లెగ్ స్టంప్ వెలుపల వేయడంతో అంపైర్ వైడ్ గా ప్రకటించాడు.ఆ బంతిని కీపర్ కూడా ఆపలేకపోయాడు.అంటే వైడ్ తో కలిపి మరో నాలుగు పరుగులు వచ్చాయి.

 

మూడో బంతి ఆఫ్ స్టంప్ వెలుపల పడి వైడ్ గా మరొక రన్ దొరికింది.ఐదో బంతికి మళ్లీ అదే పొరపాటు చేసి వైట్ తో పాటు 4 పరుగులు ఇచ్చాడు భువీ.దీంతో 10 ఏళ్ల కిందటి జడేజా చెత్త రికార్డును బ్రేక్ చేసాడు.2012 లో రాజస్థాన్ పై జడేజా ఒకే ఓవర్ లో లో వైడ్ ల రూపంలో 10 పరుగులుు ఇచ్చాడు.కాగా ఈ మ్యాచ్ లో భువీ 4 ఓవర్లలో 37 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు.

Read more RELATED
Recommended to you

Latest news