చిత్రలహరి గురించి మెగాస్టార్ చిరంజీవి మెసేజ్..!

-

మెగా మేనళ్లుడు సాయి తేజ్ హీరోగా కిశోర్ తిరుమల డైరక్షన్ లో వచ్చిన సినిమా చిత్రలహరి. కళ్యాణి ప్రియదర్శి, నివేదా పేతురాజ్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. ఏప్రిల్ 12 శుక్రవారం రిలీజైన ఈ సినిమా మొదటి రోజు మిక్సెడ్ టాక్ తెచ్చుకున్నా ఫైనల్ గా సినిమా గట్టెక్కినట్టే అనిపిస్తుంది. ఇక ఈ సినిమా చూసిన మెగాస్టార్ చిరంజీవి చిత్రలహరిపై తన కామెంట్స్ వెళ్లడించారు.

కిశోర్ తిరుమల ఓ చక్కని మెసేజ్ తో ఈ సినిమా చేశాడని.. తేజూ కూడా సినిమాలో చాలా పరిణితితో నటించాడని.. పోసాని, సునీల్ వంటి వారితో సినిమాకు నిండుతనం వచ్చిందని. ఈ సినిమాతో యువతకు మంచి మెసేజ్ ఇచ్చి సినిమా సక్సెస్ అందుకున్నందుకు చిత్రయూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు. మైత్రి మూవీ మేకర్స్ సక్సె ఫుల్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ అని.. ఆ బ్యానర్ ప్రతిష్ఠ మరింత పెంచేలా ఈ సినిమా ఉందని అన్నారు.

బంధాలు బాంధవ్యాల గురించి, ముఖ్యంగా తండ్రీ కొడుకుల అనుబంధం గురించి చాలా చక్కగా చెప్పారని.. ఎలాంటి ఒడుదొడుకులు వచ్చినా, ఎలాంటి ప్రతికూల పరిస్థితులు తారసపడినా అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి కృషితో ముందుకు వెళ్తే గనుక సాధించలేనిది ఏదీ లేదు అని యువతకు చాలా చక్కని మెసేజ్ అందించిన సినిమా చిత్రలహరి అని కొనియాడారు.

ఇక చిరంజీవి తన సినిమా గురించి మాట్లాడిన వీడియోని ట్వీట్ చేసిన హీరో సాయి తేజ్ మావయ్యకు కృతజ్ఞతలు తెలిపారు. మీ ప్రశంసలకు, ఈ సినిమాకు పిల్లర్ గా నిలిచి సపోర్ట్ ఇచ్చినందుకు థాంక్యూ సో మచ్ మామ. నా ఫీలింగ్స్ వ్యక్తపరచడానికి ప్రస్తుతం చాలా తక్కువ పదాలను వాడుతున్నాను. థాంక్యూ సో మచ్ అంటూ సాయి తేజ్ ట్వీట్ చేశాడు.

Read more RELATED
Recommended to you

Latest news