చిత్రలహరి వీకెండ్ కలక్షన్స్.. తేజ్ ఒడ్డున పడ్డట్టే..!

-

మెగా హీరో సాయి తేజ్ కిశోర్ తిరుమల కాంబినేషన్ లో వచ్చిన సినిమా చిత్రలహరి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా 13 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో రిలీజైంది. తిక్క నుండి తేజ్ ఐలవ్యూ వరకు వరుసగా 6 ఫ్లాపులు ఫేజ్ చేసిన సాయి తేజ్ చిత్రలహరితో పర్వాలేదు అనిపించాడు. మొదటిరోజు మిక్సెడ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఓవరాల్ గా సాయి తేజ్ ను ఒడ్డున పడేసిందని చెప్పొచ్చు.

చిత్రలహరి 3 డేస్ కలక్షన్స్ 7.75 కోట్లు వసూళ్లు చేసింది. ఇది కేవలం తెలుగు రెండు రాష్ట్రాల్లో వసూళ్లు. ఎలా లేదన్నా వారంలోనే చిత్రలహరి బ్రేక్ ఈవెన్ సాధించి డిస్ట్రిబ్యూటర్స్ కు లాభాలు తెచ్చేలా ఉంది. ఏరియాల వారిగా చిత్రలహరి 3 డేస్ కలక్షన్స్ ఎలా ఉన్నాయో చూస్తే..

నైజాం : 2.53 కోట్లు
సీడెడ్: 1.28 కోట్లు
ఉత్తరాంధ్ర: 1.10 కోట్లు
కృష్ణ: 0.60 కోట్లు
గుంటూరు: 0.67 కోట్లు
ఈస్ట్ : 0.78 కోట్లు
వెస్ట్: 0.50 కోట్లు
నెల్లూరు: 0.29 కోట్లు

ఏపీ/ తెలంగాణా : 7.75 కోట్లు

Read more RELATED
Recommended to you

Latest news