క్రికెట్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు సచిన్ టెండూల్కర్.అందరూ ముద్దుగా గాడ్ ఆఫ్ క్రికెట్ అని పిలుచుకుంటారు.క్రికెట్ లో ఎన్నో రికార్డులను ఆయన సృష్టించాడు.వన్డే క్రికెట్ లో అసాధ్యం అనుకున్న డబుల్ సెంచరీని మొదట సుసాధ్యం చేసిన ఘనత కూడా ఆయనకే సొంతం.ఆటలోనే కాకుండా వ్యక్తిత్వం పరంగా ఆయన గొప్ప వ్యక్తి.అందుకే ఆయనను అందరూ ఇష్టపడతారు.అయితే తాజాగా సచిన్ కి సంబంధించిన ఒక వీడియో వైరల్ అవుతుంది.ఆ వీడియోలో సచిన్ కాళ్లను దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు జాంటీ రోడ్స్ పట్టుకున్నట్లు కనిపిస్తుంది.ఐపీఎల్ 2020 2 లో 23వ మ్యాచ్లో పంజాబ్ చేతిలో ముంబై జట్టు పరాజయంం పాలైంది.
ముంబై జట్టు మిడిలార్డర్ బ్యాట్స్ మెన్ సూర్యకుమార్ యాదవ్, కీరణ్ పోలార్డ్ ను పంపించడంతో పంజాబ్ కు విజయం మరింత సులువుగా మారింది.ఐతే మ్యాచ్ అనంతరం ముంబై ఇండియన్స్ జట్టు మెంటర్ సచిన్, పంజాబ్ కింగ్స్ జట్టు ఫీల్డింగ్ కోచ్ ఇద్దరు మైదానం లో కలుసుకున్నారు.ఇద్దరు మాజీ ఆటగాళ్లు ఒకరికొకరు షేక్ హ్యాండ్స్ ఇచ్చుకున్నారు.ఇంతలో సచిన్ కాళ్ళను పట్టుకునేందుకు జాంటి రోడ్స్ ప్రయత్నించారు. దీంతో అలాంటివి వద్దంటూ జాంటీ రోడ్స్ ను సచిన్ టెండూల్కర్ అడ్డుకున్నాడు.కానీ రోడ్స్ మాత్రం బలవంతంగా సచిన్ కాళ్లను పట్టుకున్నాడు.దీంతో వెంటనే రోడ్స్ ను సచిన్ పైకి లేపి హత్తుకున్నాడు.