గవర్నర్ పై మంత్రి తలసాని సంచలన వాక్యాలు చేశారు. రాజ్యాంగ పదవిలో ఉన్న గవర్నర్ ప్రెస్ మీట్లు పెట్టి నిందించటం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలు తమవని.. నామినేటెడ్ వ్యక్తులు కాదని ఫైర్ అయ్యారు. రాజకీయ పార్టీల వ్యక్తిలా మాట్లాడటం మంచిది కాదని నిప్పులు చెరిగారు.
ఈ ముఖ్యమంత్రి తో పనిచేయటం ఇష్టం లేదు అని చెప్పటం సరికాదని… ఏది పడితే అది మాట్లాడటం కరెక్ట్ కాదని ఓ రేంజ్‌లో రెచ్చిపోయారు. రాజకీయ పరమైన మాటలు గవర్నర్ మాట్లాడుతున్నారు… ప్రజల ఎన్నుకున్న ప్రభుత్వం పైన ఆరోపణలు సరికాదన్నారు.
ఉపరాష్ట్రపతి,గవర్నర్ అనే రోల్ చాలా తక్కువ అని… గవర్నర్ గా మీ బాధ్యత మీరు నిర్వర్తించండని చురకలు అంటించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు లాంటి వారే ప్రోటోకాల్ విషయంలో కొన్ని రెస్ట్రక్షన్స్ ఉంటాయి అన్నారని… అది కూడా గవర్నర్ తెలుసుకొని మాట్లాడాలని ఆగ్రహించారు. రాజ్యాంగ పరమైన విధానంలో కాంగ్రెస్ స్టాండ్ ఏంటి? అని.. ప్రతిపక్షాలకు పని పాట లేదని ఆగ్రహించారు.