కలర్స్ షో ద్వరా ప్రేక్షకులకు పరిచయమై ఆ తర్వాత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన స్వాతి తెలుగు, తమిళ భాషల్లో పలు సినిమాలు చేసింది. తన క్యూట్ లుక్స్ తో అందరిని ఆకట్టుకునే అమ్మడు కొన్నాళ్లుగా మలేషియన్ ఎయిర్ లైన్స్ లో పైలెట్ గా పనిచేస్తున్న వికాస్ ను ప్రేమిస్తుందట. ఇరువురి కుటుంబాలు ఈ పెళ్లికి ఓకే చెప్పడంతో పెళ్లి చేసుకుని కనిపించారు.
వికాస్, స్వాతిల పెళ్లి వేడుకలకు సిని సెలబ్రిటీస్ అంతగా రాలేదు. కేవలం కొద్దిమంది కుటుంబ సభ్యుల సమక్షంలోనే ఈ వివాహం జరిగిందట. పెళ్లికి ఎవరిని పిలవకున్నా రిసెప్షన్ మాత్రం గ్రాండ్ గా ప్లాన్ చేసిందట స్వాతి. సెప్టెంబర్ 2న కొచ్చిలో రిసెప్షన్ ప్లాన్ చేశారట. అయితే ఇక్కడ సెలబ్రిటీస్ అండ్ వెల్ విషర్స్ కోసం వేరే రిసెప్షన్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.