తెలంగాణ విద్యార్థులకు గుడ్‌న్యూస్… ఇవాల్టి నుంచే వేసవి సెలవులు

-

విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అదిరిపోయే శుభ వార్త చెప్పింది. ఏప్రిల్ 24 వ తేదీ అంటే ఇవాల్టి  నుంచి జూన్ 12వ తేదీ వరకు స్కూల్ విద్యార్థులకు వేసవి సెలవులు ప్రకటించింది కెసిఆర్ ప్రభుత్వం. ఎండలు ముదురుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. తిరిగి జూన్ 13వ తేదీన యధావిధిగా తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాలలు ప్రారంభం కానున్నాయి.

ఈ వేసవి సెలవులు ఒకటి నుంచి 9వ తరగతి విద్యార్థులకు మాత్రమే ఉంటాయి. మే 23 వ తేదీ నుంచి 28వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఈ పదో తరగతి పరీక్షల నేపథ్యంలో ఇవాల్టి  నుంచి రోజుకు ఒక ఉపాధ్యాయుడు స్కూళ్లకు వెళ్లాల్సి ఉంటుంది.

వారికి పరీక్షలు ఉన్న నేపథ్యంలో.. విద్యా శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఇక ఇవాల్టి నుంచి ప్రైవేట్ స్కూల్స్ ఓపెన్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది తెలంగాణ విద్యాశాఖ. కాగా మే ఆరో తేదీ నుంచి 18వ తేదీ వరకు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు ఉండగా… మే ఏడో తేదీ నుంచి 19వ తేదీ వరకు ఇంటర్ సెకండియర్ పరీక్షలు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news