బిజినెస్ ఐడియా: లెమన్ గ్రాస్ తో ఎకరానికి లక్షకి పైగా లాభాలు…!

-

ఉద్యోగాల కంటే వ్యాపారాలు చేసి చాలా మంది ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నారు. నిజానికి ఉద్యోగం కంటే వ్యాపారం వల్ల చాలా లాభాలు పొందొచ్చు. మీరు కూడా ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటున్నారా..? ఆ వ్యాపారం ద్వారా మంచిగా డబ్బులు సంపాదించాలని అనుకుంటున్నారా..? అయితే మీ కోసమే ఈ బిజినెస్ ఐడియా.

 

మీరు ఈ బిజినెస్ ఐడియా ని ఫాలో అయ్యారంటే లక్షల్లో డబ్బులు సంపాదించడానికి అవుతుంది. అదే లెమన్ గ్రాస్ బిజినెస్ మరి ఇక దీనికోసం పూర్తి వివరాల్లోకి వెళితే… లెమన్ గ్రాస్ తో లక్షల్లో లాభాలు సంపాదించవచ్చు. పెద్ద మొత్తంలో దీనికి పెట్టుబడి పెట్టాల్సిన పనేం లేదు. మీ వద్ద వ్యవసాయ భూమి ఉండాలి. ఒక హెక్టారు భూమి లో మీరు లెమన్ గ్రాస్ పండిస్తే ఏడాదికి నాలుగు లక్షల వరకు సంపాదించడానికి అవుతుంది లెమన్ గ్రాస్ కి పురుగులు, కీటకాలు వంటివి పట్టవు కాబట్టి ఏ టెన్షన్ పడక్కర్లేదు.

ఈ గ్రాస్ నుండి తీసిన నూనె కి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది అలాగే ఈ పంట కోసం ఎరువులని కూడా ఉపయోగించకూడదు. ఒక్కసారి పంట వేస్తే 5 నుండి 6 ఏళ్ల వరకు పంట ఉంటుంది. ఈ ఆయిల్ రేటు మార్కెట్ లో కేజీ కి 1000 నుంచి 1500 వరకు ఉంటుంది.

ఎకరా భూమిలో లెవెన్ గ్రాస్ వేస్తే 30 వేల నుంచి 40 వేల వరకు ఖర్చు అవుతుంది. 3 నుండి 4 సార్లు ఏడాదిలో కోయచ్చు. దీంతో మీకు 100 నుండి 150 లీటర్ల నూనె వస్తుంది. ఈ ఆయిల్ విక్రయించడం వల్ల లక్ష నుంచి లక్షన్నర పొందొచ్చు. ఖర్చులు పోను ఇలా మీకు నెలకి 70 వేల నుంచి లక్ష వరకు మిగులుతాయి.

Read more RELATED
Recommended to you

Latest news