ఏపీలో సీపీఎస్ రద్దు కోసం చలో సీఎంవో పోరుగర్జనకు రేపు యూటీఎఫ్ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో రేపు చలో సీఎంవో పోరుగర్జన కార్యక్రమానికి బయలుదేరుతున్న ఉపాధ్యాయులను ఎక్కడికక్కడ ముందస్తుగా పోలీసులు బైండోవర్ చేస్తున్నారు. యర్రగొండపాలెంలో 20 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులపై పోలీసులు బైండోవర్ కేసులు నమోదు చేశారు.
దీంతో పాటు దర్శిలో 200 మంది ఉపాధ్యాయులకు, గిద్దలూరులో 90 మంది ఉపాధ్యాయులకు, మార్కాపురంలో 36 మంది ఉపాధ్యాయులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. కనిగిరిలో 40 మంది ఉపాధ్యాయులకు, కంభంలో 10 మంది ఉపాధ్యాయులకు, పొదిలిలో 12 మంది ఉపాధ్యాయులకు బైండోవర్ నోటీసులను పోలీసులు జారీ చేశారు. అయితే సీసీఎస్ రద్దు కోసం ఉపాధ్యాయులు గత కొన్ని రోజుల నుంచి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.