యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మరో సంచలన నిర్ణయం

-

ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.మంత్రులు తమ సొంత ఆస్తులతో పాటు కుటుంబ సభ్యుల ఆస్తి వివరాలను మూడు నెలల్లోగా ప్రకటించాలని ఆదేశించారు.అంతేకాకుండా ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు కూడా తమ ఆస్తుల్ని ప్రకటించాలని ఆదేశించారు యోగి.ఆన్ లైన్ లో వివరాలు అందుబాటులో ఉంచాలని సూచించారు.యోగి ఆదిత్యనాథ్ ఇటీవల అసెంబ్లీ ఎన్నికల సమయంలో దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్ లో తన ఆస్తుల వివరాలు పొందుపరిచారు.లిక్విడ్ క్యాష్, బ్యాంకు అకౌంట్లు, ఫిక్స్ డ్ డిపాజిట్ల రూపంలో తనకు ఒక కోటీ 54 లక్షల ఆస్తులు ఉన్నట్లు అందులో యోగి తెలిపారు.

ఇక మంత్రులు, ఉన్నతాధికారులు, అధికారిక పర్యటనల్లో ప్రైవేట్ హోటళ్ల కు వెళ్లకుండా ప్రభుత్వ అతిథి గృహల్లొనే ఉండాలన్నారు.మంత్రుల కుటుంబ సభ్యులు ప్రభుత్వ పనుల్లో జోక్యం చేసుకోరాదని తేల్చి చెప్పారు.ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యం కోసం ప్రజా ప్రతినిధుల ప్రవర్తన ఎంతో ముఖ్యమన్నారు.5 వేలకు పైబడిన ఎలాంటి గిఫ్ట్ లు తీసుకోవద్దని, విలాసవంతమైన నివాసాలకు, పార్టీలకు, డిన్నర్ లకు దూరంగా ఉండాలని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news